జాతీయ వార్తలు

ద్రోహులకు శిక్ష తప్పదని ప్రజలకు తెలుసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, ఫిబ్రవరి 17: పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడితో దేశ ప్రజలు దిగ్భ్రాంతికి, కలవరానికి గురయ్యారని, అయితే నిరాశానిస్పృహలకు మాత్రం లోనుకాలేదని, ఎందుకంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం దాడికి కారణమయిన ద్రోహులను శిక్షించి తీరుతుందనే విశ్వాసం వారిలో ఉందని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. ఆదివారం ఇక్కడ బీజేపీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రధానమంత్రి ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చర్య తీసుకోవడానికి దేశ సాయుధ బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని అన్నారు. పెద్ద సంఖ్యలో భారతీయ సైనికులు మృతి చెందుతుండటం పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కాశ్మీర్ సమస్యకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ‘దేశ ప్రజలు ఈ సంఘటనతో దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ దేశానికి చెందిన ఒక యువకుడు రెండేళ్ల క్రితం ఉగ్రవాదులతో సాన్నిహిత్యం ఏర్పరచుకున్నాడు. తరువాత తనకు తానుగా ఉగ్రవాదిగా మారాడు. అందుకే ఈ సందర్భంలో తాను ప్రజలు ‘దిగ్భ్రాంతి’కి గురయ్యారనే పదాన్ని వాడాను’ అని ఆమె పేర్కొన్నారు. జైషే మొహమ్మద్ ఉగ్రవాది గురువారం సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జరిపిన ఆత్మాహుతి బాంబు దాడిలో 40 మంది జవాన్లు చనిపోయిన విషయం తెలిసిందే.