జాతీయ వార్తలు

అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హజారిబాగ్ (ఝార్ఖండ్): సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం ఎన్‌డీఏ ప్రభుత్వం గత నాలుగున్నరేళ్ల కాలంలో ఝార్ఖండ్‌లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం ఇక్కడ ఆయన పలు అభివృద్ధి పథకాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి పథకాల కొనసాగింపులో భాగంగానే తాను ఇప్పుడు హజారిబాగ్ పర్యటనకు వచ్చానని అన్నారు. ‘డుంకా, పాలము, హజారిబాగ్‌లలో మూడు వైద్య కళాశాలలను ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇలాంటి వైద్య కళాశాలలు మూడే ఉన్నాయి. ప్రస్తుతం ప్రారంభించిన మూడు అదనపు కళాశాలలతో విద్యార్థులు భవిష్యత్తులో వైద్య విద్యను అభ్యసించడానికి దూర ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం లేదు. అంతేకాకుండా రాష్ట్ర ప్రజలు సులభంగా వైద్య సౌకర్యాలను పొందగలుగుతారు’ అని ప్రధాని అన్నారు. తన ప్రసంగానికన్నా ముందు ప్రారంభించిన ‘గిఫ్ట్ మిల్క్ స్కీమ్’ గురించి ఆయన మాట్లాడుతూ ఈ పథకం ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లల్లో పోషకాహార ప్రమాణాలను మెరుగుపరుస్తుందని అన్నారు. స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయడానికి ఆర్థిక సాయం పొందిన రైతులను మోదీ ఈ సందర్భంగా అభినందించారు. ‘రైతులు ఇప్పుడు ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను తెలుసుకోగలుగుతారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను తెలుసుకుంటారు. ప్రభుత్వ పథకాలను తెలుసుకుంటారు’ అని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్ (పీఎంజేఏవై) ద్వారా రాష్ట్రంలో 57వేల మందికి పైగా ప్రజలు లబ్ధి పొందారని ప్రధాని పేర్కొన్నారు.
చిత్రం.. హజారిబాగ్‌బాగ్‌లో ఆదివారం మూడు వైద్య కళాశాలలకు శంకుస్థాపన చేసిన అనంతరం
బహిరంగ సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ