జాతీయ వార్తలు

మాటలకు చెల్లుచీటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: పాకిస్తాన్‌తో చర్చల ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోదీ తెగేసి చెప్పారు. పుల్వామాలో జరిగిన భయానక ఉగ్రదాడితో ఇక చర్చలకు ఎంత మాత్రం ఆస్కారం లేదన్న విషయం స్పష్టమైందని తెలిపారు. ఉగ్రవాదాన్ని ఉపేక్షించడం, దీనికి మద్దతునిస్తున్నవారిపై ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం అన్నది ఈ జాడ్యాన్ని పెంపొందించడమే అవుతుందని మోదీ అన్నారు. ఉగ్రవాదాన్ని అణచివేయడంతో పాటు దీనికి అన్ని విధాలుగా మద్దతునిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రపంచ దేశాలు ఏకం కావాల్సిన తరుణం ఆసన్నమైందని ఉద్ఘాటించారు. అర్జెంటీనా అధ్యక్షుడు వౌరిషియో మాక్రీతో ప్రతినిధుల స్థాయి చర్యల అనంతరం మోదీ మాట్లాడారు. రక్షణ, అణు ఇంధనం, టూరిజం, సమాచార టెక్నాలజీ సహా మొత్తం పది రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకునేందుకు ఇరు దేశాల మధ్య ఈ సందర్భంగా కీలక ఒప్పందాలు కుదిరాయి. అలాగే తీవ్రవాదాన్ని ఉమ్మడిగా అణచివేస్తామని స్పష్టం చేస్తూ రెండు దేశాలూ ఓ ప్రకటన కూడా విడుదల చేశాయి. ‘ప్రపంచ శాంతి, సుస్థిరతలకు ఉగ్రవాదం పెనుముప్పే. పుల్వామా దాడితో చర్చలకు ఆస్కారమే లేదన్న విషయం స్పష్టమైంది’అని తేల్చిచెప్పారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో 11 అంశాలతో కూడిన హాంబర్గ్ ప్రకటనను అమలు చేయాల్సిన అవసరం ఎంతో ఉందని మాక్రీ సమక్షంలో మోదీ ఉద్ఘాటించారు. అర్జెంటీనాతో కుదిరిన రక్షణ ఒప్పందం వల్ల రెండు దేశాల సంబంధాలు మరింత నిర్ణయాత్మక దశకు చేరుకున్నట్టయిందన్నారు. ఇప్పటికే ఈ రెండు దేశాలూ అంతర్జాతీయ వేదికలపై పరస్పర సహకారంతో పని చేస్తున్నాయని, అంతర్జాతీయ శాంతి, భద్రతల పరిరక్షణకు ఐరాస మరింత కీలక భూమికను పోషించాల్సిన అవసరం గురించి కూడా స్పష్టం చేస్తూ వచ్చామన్నారు. మారిన ప్రపంచానికి అద్దం పట్టేలా భద్రతామండలిని సంస్కరించాలని, అలాగే దీని ప్రాతినిధ్య స్వభావాన్ని మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని మోదీ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. కాగా, ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో భారత్‌తో కలిసి పని చేస్తామని అర్జెంటీనా అధ్యక్షుడు మాక్రి స్పష్టం చేశారు.