జాతీయ వార్తలు

కాంగ్రెస్ గూటికి కీర్తి ఆజాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: బీహార్ రాష్ట్రంలోని దర్భంగా పార్లమెంటు సభ్యుడు, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ సోమవారం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన కీర్తి ఆజాద్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని విమర్శలు చేయడంతో అతనిని అధిష్టానం పార్టీ నుంచి బహిష్కరించింది. దీంతో ఆయన సోమవారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలుసుకుని కాంగ్రెస్‌లో చేరారు. 60 ఏళ్ల కీర్తి ఆజాద్ మాజీ క్రికెటర్. గత 26 ఏళ్లుగా బీజేపీలో కొనసాగుతున్న ఆయన ప్రస్తుతం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘వివిధ పథకాల పేరిట ప్రజలను మభ్యపెట్టడం, అవినీతి వంటివి ప్రత్యక్షంగా చూసి చివరకు విరక్తి చెందాను. నా తండ్రి, దివంగత భగవత్ ఝా ఆజాద్ సేవలు అందించిన కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నాను. ఈ నిర్ణయంతో స్వంత ఇంటిలోకి వచ్చిన అనుభూతిని పొందుతున్నాను’ అని కీర్తి ఆజాద్ వ్యాఖ్యానించారు. కీర్తి ఆజాద్ తండ్రి దివంగత భగవత్ ఝా ఆజాద్ బీహార్‌కు కొంతకాలంపాటు ముఖ్యమంత్రిగా కూడా వ్యవహరించారు. కీర్తి ఆజాద్ 1983లో ప్రపంచ కప్ సాధించిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నారు. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) 400 కోట్ల రూపాయల నిధులకు సంబంధించిన వివాదంపై 2015లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై తీవ్ర విమర్శలు చేసిన చేసిన నేపథ్యంలో బీజేపీ కీర్తి ఆజాద్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది. తాను చేసిన ఆరోపణలపై కట్టుబడి ఉన్నట్టు ప్రకటించి చివరకు ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహాన్ని కూడా చవిచూశారు. తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా కీర్తి ఆజాద్ మాట్లాడుతూ ‘బీజేపీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. మన వాదనలను వినేవారెవరూ ఈ పార్టీలో లేరు.