జాతీయ వార్తలు

మైనారిటీల అభ్యున్నతికి చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: దేశంలో ముస్లిం మైనారిటీలకు కనీస సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తర్ అబ్బాస్ నఖ్వీ చెప్పారు. కొత్తగా ఏర్పాటైన కేంద్ర వక్ఫ్ కౌన్సిల్(సీడబ్ల్యూసీ) సమావేశం మంత్రి నఖ్వీ అధ్యక్షతన సోమవారం జరిగింది. దేశంలో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన వెల్లడించారు. దీని కోసం కేంద్రం వంద శాతం ఆర్థిక చేయూతను ఇస్తుందని నఖ్వీ తెలిపారు. ముస్లిం మైనారిటీల సామాజిక- ఆర్థిక సాధికారిత కోసం కేంద్రం కృషి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. మైనారిటీ విద్యార్థులు విద్య, ఉపాధి రంగాల్లో ప్రాధన్యత కల్పిస్తామని, నైపు ణ్య రంగంలోనూ యువతకు శిక్షణ ఇస్తామని ఆయన చెప్పారు. మైనారిటీలు మోదీ ప్రభు త్వం ప్రాధాన్యత ఇస్తోందని, ముఖ్యంగా బాలికలకు అభ్యున్నతకి చర్యలు తీసుకుంటున్నట్టు నఖ్వీ పేర్కొన్నారు. సమావేశానికి ముందు పుల్వామా అమర జవాన్ల మృతికి రెండు నిమిషాలు వౌనం పాటించారు. మైనారిటీ విద్యార్థులకు ప్రధాన్ మంత్రి జన వికాస్ కార్యక్రమం పథకం కింద పాఠశాలలు, కాలేజీ భవనాలు నిర్మిస్తామన్నారు.