జాతీయ వార్తలు

ప్రజాభీష్టం మేరకే నా రాజకీయ జీవితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంఫాల్, ఆగస్టు 11: రాజకీయ నాయకురాలిగా కొత్త జీవితాన్ని ప్రారంభించాలన్న తన కోరికను ప్రజలు తిరస్కరిస్తేనే వైవాహిక జీవితంలోకి అడుగుపెడతానని పౌరహక్కుల కార్యకర్త ఇరోం షర్మిల స్పష్టం చేశారు. పదహారేళ్ల నిరాహార దీక్షను మంగళవారం విరమించిన ఆమె వచ్చే ఏడాది జరగనున్న మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంతోపాటు పెళ్లి చేసుకోవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.‘వ్యక్తిగత జీవితం ఎలా ఉండాలన్న దానిపై నేనొక నిర్ణయం తీసుకున్నాను.దాన్ని అమలుచేయలేని పక్షంలో నన్నునేను అవమానించుకున్నట్టే. నా జీవితంలో కొత్త అధ్యయనం మొదలెట్టాలని భావిస్తున్నా’ అంటూ చెమర్చిన కళ్లతో షర్మిల స్పష్టం చేశారు. జెఎన్‌ఐఎంఎస్ నిపుణులు పర్యవేక్షణలో వైద్య సేవలందుకుంటున్నారు. దీక్షలో ఉన్నప్పుడు సుదీర్ఘకాలం పాటు ద్రవ రూపంలో ఆహారం తీసుకున్న షర్మిలకు ఘన ఆహారానికి సంసిద్ధురాలిని చేయడానికి వైద్యులు కృషి చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్న షర్మిల తాను ఎప్పుడు డిశ్చార్జి అయ్యేదీ వెల్లడించలేదు. మంగళవారం కోర్టు బెయిల్ మంజూరు చేసే సమయంలో షర్మిల బాయ్‌ఫ్రెండ్ డెస్మాండ్ కౌటిన్హొ ఆమెతో పాటు లేడు. దీక్ష విరమించిన వెంటనే ఆమె మాట్లాడుతూ 2017 మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో తౌబాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. ముఖ్యమంత్రి ఒక్రాం ఇబోబి ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.