జాతీయ వార్తలు

‘్భరత్ మాతాకీ జై’ అన్నందుకు నోటీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, ఆగస్టు 11: గుజరాత్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన గుజరాత్ ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ (జిఎండిసి) కార్యకలాపాలు నిర్వహిస్తున్న దక్షిణ కొరియాకు చెందిన ఓ కంపెనీ తన ఉద్యోగి ఒకరు ‘్భరత్ మాతాకి జై’ అంటూ నినదించినందుకు క్రమశిక్షణా చర్య ఎందుకు తీసుకోకూడదో తెలియజేయాలంటూ నోటీసు జారీ చేయడం వివాదాస్పదంగా మారింది. కచ్ జిల్లాలోని నాని చేర్ గ్రామం వద్ద ఉన్న జిఎండిసి ఆధ్వర్యంలోని అక్రిమోటా థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్వహణ బాధ్యతలను దక్షిణ కొరియా ప్రభుత్వ సంస్థ అయిన కెప్కో ప్లాంట్ సర్వీస్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ చూస్తోంది. అయితే ఆ కంపెనీ ‘్భరత్ మాతాకీ జై’ నినాదాలిచ్చాడంటూ ఇటీవల దిలీప్ శ్రీమాలి అనే జూనియర్ ఇంజనీర్‌కు నోటీసు జారీ చేసింది. అయితే యూనియన్ కలగజేసుకోవడంతో ఆ వ్యవహారం జిఎండిసి మేనేజిమెంట్ వద్దకు చేరింది. దీంతో ‘్భరత్ మాతాకి జై’ అనే నినాదం దేశ గౌరవానికి సంబంధించిన అంశమని, జిఎండిసి ఒక సర్క్యులర్ జారీ చేసిందని ఆ సంస్థకు చెందిన ఉన్నతాధికారి తెలియజేశారు.