జాతీయ వార్తలు

సోనియాకు జ్వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 11: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని, ఆమె మరికొన్ని రోజులపాటు ఆసుపత్రిలోనే ఉండి చికిత్స చేయించుకోవాల్సిన అవసరం ఉందని ఇక్కడి గంగారాం ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. అస్వస్థత కారణంగా తొమ్మిది రోజుల క్రితం సోనియా గాంధీ ఈ ఆసుపత్రిలో చేరారు. ఈపాటికే సోనియా గాంధీని డిస్‌చార్జ్ చేయాల్సి వుందని, అయితే జ్వరం రావడం వల్ల మరికొన్ని రోజులపాటు చికిత్స అవసరమని తెలిపారు. గురువారం వైద్యుల బృందం సోనియా ఆరోగ్యాన్ని పరీక్షించింది. ఇన్‌ఫెక్షన్ కారణంగా జ్వరం వచ్చిందని, దీని చికిత్సకు మరికొన్ని రోజులు ఉండాలని ఆమెకు స్పష్టం చేశారు. ప్రస్తుతం సోనియాకు యాంటీబయాటిక్స్ ఇస్తున్నామని, ఇన్‌ఫెక్షన్ క్రమంగా తగ్గుతోందని డాక్టర్ డి.ఎస్.రాణా వెల్లడించారు.