జాతీయ వార్తలు

పాక్‌కు నీళ్లూ బంద్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: పుల్వామా ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్తాన్‌ను దారికి తెచ్చేందుకు తీసుకుంటున్న చర్యల తీవ్రతను భారత్ మరింతగా పెంచింది. అత్యంత ప్రాధాన్య దేశం (ఎమ్‌ఎఫ్‌ఎన్) జాబితా నుంచి ఇప్పటికే పాక్‌ను తొలగించిన భారత్ తాజాగా జలాల కట్టడిపై దృష్టి పెట్టింది. సింధు నదీ జలాల్లో తన వాటా పాక్‌లోకి ప్రవహించకుండా అడ్డుకోవాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ట్వీట్ చేశారు. అయితే భారత్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇరుదేశాల మధ్య కుదిరిన సింధు నదీ జలాల ఒప్పందం కింద పాక్ వాటాపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఇప్పటివరకూ సింధు జలాల్లో భారత వాటా నీరు పాకిస్తాన్‌లోకి ప్రవహిస్తూ వచ్చేదని, ఇకనుంచి ఈ జలాల్ని తూర్పు నదుల ద్వారా మళ్లించి జమ్ముకాశ్మీర్, పంజాబ్ ప్రజలకు సరఫరా చేస్తామని గడ్కరీ వెల్లడించారు. అంటే రావీ, బియాస్, సట్లెజ్ నదీ జలాలు పాకిస్తాన్‌లోకి ప్రవహించకుండా కాశ్మీర్, పంజాబ్‌లకు మళ్లిస్తామన్నారు. సింధు నదీ జలాల ఒప్పందం ప్రకారం సట్లెజ్, రావీస్, బియాస్ నదీ జలాలను భారత్‌కు, చీనాబ్, జీలం, సింధు నదీ జలాలను పాక్‌కు కేటాయించారు. అయితే భారత్ 93 నుంచి 94శాతం మేర మాత్రమే ఈ మూడు నదుల నీటిని వాడుకుని మిగిలిన జలాలు పాకిస్తాన్‌కు మళ్లిస్తోంది. ఈ మిగిలిన జలాలు పాకిస్తాన్‌కు చేరకుండా నిలిపి కాశ్మీర్, పంజాబ్‌కు మళ్లిస్తామని గడ్కరీ వివరించారు.
ఈ జలాల్ని ఉపయోగించుకునేందుకు ప్రాజెక్టులను చేపట్టి వేగవంతంగా పూర్తి చేయాలని 2016లో జరిగిన యూరీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్ నిర్ణయించింది. ఇందులో భాగంగానే షాపూర్ కండి డ్యామ్,రెండో సట్లెజ్-బియాస్ లింక్ ప్రాజెక్టు. జమ్ములో ఉజ్ డ్యామ్‌లను భారత్ చేపట్టింది.

చిత్రం.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ