జాతీయ వార్తలు

ప్రధాన మంత్రిది బాధ్యతారాహిత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో జైషే మహమ్మద్ ఉగ్రవాదులు సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి చేసిన తరువాత కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేషనల్ కార్బైట్ పార్క్‌లో డాక్యుమెంటరీ షూటింగ్‌లో పాల్గొనటం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా విమర్శించారు. గురువారం ఏఐసీసీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ పుల్వామా దాడి విషయంలో బీజేపీ, ఎన్‌డీఏ మంత్రులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఉగ్రవాదుల దాడిలో మరణించిన వీర జవాన్ల శవ పేటికలతో మంత్రులు సెల్ఫీలు దిగటం అమానుషమని ఆయన విమర్శించారు. దేశమంతా బాధలో ఉంటే నరేంద్ర మోదీ మాత్రం ఉత్తరప్రదేశ్ రాంనగర్‌లోని నేషనల్ కార్బైట్ పార్క్‌లో విహరించటం, ప్రచార డాక్యుమెంటరీ తయారీ షూటింగ్‌లో పాల్గొనటం వారి బాధ్యతా రహిత్యానికి పరాకాష్ట అని సుర్జేవాలా ఆరోపించారు. ఈ కష్ట సమయంలో నరేంద్ర మోదీ దక్షిణ కొరియా పర్యటనకు ఎలా వెళతారని ఆయన నిలదీశారు. పుల్వామా దాడి గురించి ముందస్తు సమాచారం రాబట్టంలో ప్రధాన మంత్రి, జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు, హోం మంత్రి, నిఘా వర్గాలు విఫలమయ్యాయన్న విషయాన్ని ఎన్‌డీఏ ప్రభుత్వం ఎందుకు అంగీకరించటం లేదు? కాన్వాయ్‌పై దాడి చేసిన ఉగ్రవాదులకు వందల కొలదీ కిలోల ఆర్‌డీఎక్స్, రాకెట్ లాంచర్లు, ఆధునిక తుపాకులు ఎలా లభించాయి? కాన్వాయ్ వెళుతున్న రోడ్డు మీదికి ఆర్‌డీఎక్స్ నింపి ఉన్న కారు ఎలా వచ్చింది? ఉగ్రవాద దాడి గురించి సూచించే వీడియో దాడికి 36 గంటల ముందు వచ్చినా ఎందుకు పట్టించుకోలేదు? భద్రతా దళాలు రోడ్డు మార్గానికి బదులు విమానంలో వెళ్లేందుకు ఎందుకు అనుమతి ఇవ్వలేదు? మోదీ ప్రభుత్వం 56 నెలల పదవీ కాలంలో 488 మంది సైనికులు మరణించలేదా? పుల్వామా దాడి గురించి తెలిసిన తరువాత కూడా మోదీ డాక్యుమెంటరీ షూటింగ్‌లో ఎలా పాల్గొన్నారు? పడవలో ఎందుకు తిరిగారు? అక్కడే ఆధికారులతో ఎందుకు చర్చలు జరిపారు? వారితో కూర్చొని సమోసా తిని, చాయ్ తాగటం ఏమిటి? అంటూ సుర్జేవాలా ప్రశ్నల వర్షం కురిపించారు. మీరు దేశానికి ప్రధాన మంత్రా లేక హాలీవుడ్, బాలీవుడ్ హీరోనా అంటూ సుర్జేవాలా వ్యంగ్య బాణాలు విసిరారు.

చిత్రం.. ఏఐసీసీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతున్న సుర్జేవాలా