జాతీయ వార్తలు

డ్రోన్ల నియంత్రణకు సరికొత్త విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఫిబ్రవరి 21: మానవ రహిత అంతరిక్ష విమానాలు, లేదా డ్రోన్లను నియంత్రించే సరికొత్త ‘అన్‌మేన్డ్ ట్రాఫిక్ మోనిటరింగ్ సిస్టం (యూటీఎం) ఆవిష్కృతమైంది. ‘జుప్పా’గా ప్రఖ్యాతిగాంచిన శ్రీ సాయి ఎయిరోటెక్ ఇన్నొవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మన దేశంలో తొలిసారి ఈ విధానాన్ని కనుగొన్న ఘనత సాధించింది. మేడ్ ఇన్ ఇండియా నినాదంలో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ సిస్టంను బెంగళూరులో జరుగుతున్న ‘ఎయిరో ఇండియా 2019’ షోలో ఆ కంపెనీ ప్రదర్శించింది. డ్రోన్లు, వాహన టెలీమెట్రిక్స్, ఆదాస్, వ్యవసాయ సంబంధమైన ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీకి సంబంధించిన డిజైన్ల రూపకల్పనలో పేరెన్నికగన్న జుప్పా సరికొత్త ఆవిష్కరణతో అందరి దృష్టినీ అకట్టుకుంటోంది. కాగా మానవ రహిత అంతరిక్ష విమానాలు లేదా డ్రోన్లలో ఈ కొత్త సిస్టం (యూఏఎం)ను వినియోగిస్తారు. దీనిద్వారా ఆన్‌బోర్డింగ్ లింక్ ఏర్పాటు చేసుకుని అంతరిక్ష వాహనాలను నియంత్రిస్తారు. ప్రత్యేకించి ప్రస్తుతం చట్టవిరుద్ధంగా భావిస్తున్న డ్రోన్ల నిర్వహణను అధికారికంగా మార్చేందుకు ఈ నియంత్రణ ఉపయోగపడుతుందని కంపెనీ అధికారులు తెలిపారు. 2014 అక్టోబర్‌లో డీజీసీఏ ఆంక్షలు విధించిన తర్వాత 2014 నుంచి 2018 వరకు సుమారు 5 లక్షల నియంత్రణ లేని చట్టవిరుద్ధమైన చైనా డ్రోన్లను భారత్‌లో వినియోగించాల్సి వస్తోంది. ఈక్రమంలో నియంత్రణ లేని డ్రోన్లు దేశ భద్రతకు ముప్పు తెచ్చే పరిస్థితులు నెలకొనడంతో వీటని ఓ బోర్డు ద్వారా నియంత్రించే చర్యలపై జుప్పా కంపెనీ దృష్టి నిలిపిందని జుప్పా కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో సాయి పట్ట్భారాం తెలిపారు. కాగా యూటీఎం తయారీలో పూర్తిగా భారతీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించామని తెలిపారు. చైనా వినియోగిస్తున్న డ్రోన్లలోప్రమాదకర సాంకేతిక అంశాలున్నాయన్నారు. భవిష్యత్తులో మేడిన్ ఇండియా డ్రోన్ ఎకోసిస్టం మానిటర్‌ను రూపొందించడానికి యూటీఎం ఓ ముందడుగుగా భావిస్తున్నామన్నారు.

చిత్రాలు..బెంగళూరులోని యెలహన్కా బేస్‌లో జరుగుతున్న ఏరో ఇండియా 2019 షోలో భాగంగా, రెండో రోజు, గురువారం నాటి ద్రోన్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఔత్సాహికులు. ఈ ఎయిర్ షోలో రెండో రోజు విన్యాసాల కోసం సిద్ధంగా ఉన్న ఎయిర్ క్రాఫ్ట్‌లు