జాతీయ వార్తలు

గవర్నర్‌ది తిరోగమన చర్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, ఫిబ్రవరి 21: పుల్వామాలో ఉగ్రదాడి నేపథ్యంలో రాజకీయ నాయకులకు కల్పించిన వ్యక్తిగత భద్రతను ఉపసంహరించుకోవాలన్న నిర్ణయం తిరోగమన చర్యగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా అభివర్ణించారు. రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాలను పూర్తిగా బలహీనపరచాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు గురువారం ఇక్కడ ఆరోపించారు.‘ప్రధాన రాజకీయ పార్టీల నాయకులకు వ్యక్తిగత భద్రత ఉపసహరించుకోవడం దారుణం.ఇది తిరోగమన చర్య. రాజకీయపార్టీల కార్యకలాపాలను అణచివేయడమే’అని మాజీ సీఎం వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయాన్ని గవర్నర్ సత్యపాల్‌మాలిక్ పునరాలోచించుకోవాలని ఒమర్ విజ్ఞప్తి చేశారు. గవర్నర్ తన అభ్యర్థనను పట్టించుకోని పక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ప్రకటించారు. నేతలకు భద్రత ఉపసంహరించుకోవడం వెనక బలమైన శక్తులు పనిచేశాయని ఆయన ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిఘా సంస్థలకు తెలియకుండా గవర్నర్ ఈ నిర్ణయం తీసుకుని ఉండరని, రాజకీయ ప్రయోజనాలను ఆశించే కొన్ని శక్తులు దీన్ని ప్రతిపాదించాయని ఒమర్ అబ్దుల్లా విమర్శించారు. పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై జరిగిన మారణకాండ తరువాత భద్రతా ఏర్పాట్లలో భాగంగా గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 155 మంది నాయకులు, అందులో 18 వేర్పాటువాద నేతలకు కల్పిస్తున్న వ్యక్తిగత భద్రతను గవర్నర్ ఉపసంహరించుకున్నారు. బుధవారమే గవర్నర్ ఈమేరకు ప్రకటన చేశారు. మాజీ ఐఏఎస్ అధికారి షా ఫైజాల్, పీడీపీ యూత్ చీఫ్ వాహీద్ పర్రా భద్రతలను ఉపసంహరించుకుంది.
ఇలా వుండగా దేశ వ్యాప్తంగా కాశ్మీర్ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నా ప్రధాని నరేంద్రమోదీ నోరుమెదపడం లేదని ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు.పుల్వామా దాడికి ప్రతిదాడి చేస్తామని ప్రధాని ప్రకటించారని అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యపడదని ఆయన అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా కాశ్మీర్ విద్యార్థులకు భద్రత కల్పించాలని గవర్నర్‌ను ఆయన కోరారు.