జాతీయ వార్తలు

మాయాతో మనకు పొత్తేమిటీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఫిబ్రవరి 21 యూపీలో ఎస్పీ, బీఎస్పీ ఎన్నికల పొత్తుపై సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మండిపడ్డారు. బీజేపీ ఓటమే ప్రధాన అజెండాగా సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి కూటమిగా ఏర్పడ్డారు. బీఎస్పీతో అఖిలేష్ పొత్తుపై ములాయం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మాయావతి పార్టీకి సగానికి సగం సీట్లు ఇస్తావా? అంటూ కుమారుడు అఖిలేష్‌ను నిలదీశారు. మోదీనే మళ్లీ అధికారంలోకి వస్తారంటూ ఇటీవల పార్లమెంట్‌లో సంచలన ప్రకటన చేసిన ములాయం సింగ్ తాజాగా ఎస్పీ,బీఎస్పీ పొత్తును తప్పుపట్టడం గమనార్హం. లక్నోలోని సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యాలయలో ములాయం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ టికెట్లు కావల్సిన వారు తన వద్దకు వస్తే అఖిలేష్‌తో మాట్లాడతానని ప్రకటించారు. ఇలాగైనా అఖిలేష్ యాదవ్‌లో మార్పు వస్తుందేమో చూద్దాం అన్నారు. ఏ ప్రాతిపదికన బీఎస్పీకి సగం సీట్లు ఇచ్చావని అఖిలేష్‌ను నిలదీశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలన్న ఏకైన అజెండాతో అఖిలేష్,మాయావతి కూటమిగా ఏర్పడ్డారు. గత నెలలలో ఇద్దరు అధినేతలు సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ సర్దుబాటు ప్రకటన చేశారు. 80 లోక్‌సభ స్థానాలున్న యూపీలో బీఎస్పీ 38, ఎస్పీ 37 చోట్ల పోటీచేయాలని నిర్ణయించాయి. అభ్యర్థుల జాబితా నేడోరోపో విడుదల కానుంది. ఈ పొత్తుపై ములాయం మండిపడుతున్నారు. ‘మనం ఏమన్నా బలహీనంగా ఉన్నామా? బ్రహ్మాండమైన కేడర్ ఉంది. పార్టీకి కింది స్థాయి కంటూ బలం ఉంది. కొందరు నాయకులే పార్టీని బలహీనపరుస్తున్నారు’అని ఎస్పీ వ్యవస్థాపకుడు వెల్లడించారు. తాను సీఎంగా, రక్షణశాఖ మంత్రిగా పనిచేశానని, పార్టీ బలంగా ఉన్నందునే ఇది సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ ఎన్నికల ప్రచార వ్యూహం బావుందని ఆయన మెచ్చుకున్నారు. ‘టిక్కెట్లు కావల్సినవారు నా దగ్గరకు రండి. దరఖాస్తు చేసుకోంది. అఖిలేష్ యాదవ్‌ను ఒప్పించి టిక్కెట్లు ఇప్పిస్తా’అని మూలయం విజ్ఞప్తి చేశారు.