జాతీయ వార్తలు

బుల్లెట్ రైలుకు ఓ పేరు పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: దేశంలోనే తొలి బుల్లెట్ ట్రైన్ ఒక పేరుపెట్టడం ద్వారా దానికో గుర్తింపుతీసుకురావాలని ది నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్‌హెచ్‌ఆర్‌సీఎల్) నిర్ణయించింది. ఎయిర్ ఇండియా అంటే చటుక్కున గుర్తుకువచ్చే ‘మహారాజా’లాగే బుల్లెట్ ట్రైన్‌కూ ఓ పేరు ఉంటే బావుంటుందని సంస్థ భావించింది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు 2022 నాటికి పూర్తవుతుంది. వాణిజ్య రాజధాని ముంబయి- అహ్మదాబాద్ మధ్య ఈ రైలు నడుస్తుంది. బుల్లెట్ రైలుకు ఓ పేరు సూచించాలంటూ ఎన్‌హెచ్‌ఆర్‌సీఎల్ ఎంట్రీలను ఆహ్వానిస్తోంది. ఏ పేరు బావుంటుందో సూచిస్తూ పేరు, హోదాతో ఎంట్రీలు మార్చి 25 నాటికి పంపాలని సంస్థ వెల్లడించింది. జనానికి హత్తుకునేలా పేరు ఉండాలని తెలిపారు. ఎంట్రీలు ఆన్‌లైన్‌లోనే స్వీకరిస్తారు. ఎంవైజీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌లో ఔత్సాహికులు పాల్గొనవచ్చని చెప్పారు. విజేతలకు నగదు బహుమతి ఇస్తారు. అలాగే పోటీలో పాల్గొనే వారికి సర్ట్ఫికెట్లు ఇస్తారు. ప్రతి కేటగిరిలోనూ ఐదుగుర్ని ఎంపిక చేసి కాన్సోలేషన్ బహుతులు అందజేయనున్నట్టు సంస్థ వెల్లడించింది. 2017లో ఇలాంటిదే ఓ పోటీపెట్టి వేగానికి చిహ్నమైన చిరుతను ఎంపిక చేశారు.