జాతీయ వార్తలు

అరాచక శక్తుల్ని వదలొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 11: గోరక్షణ పేరుతో సంఘ విఘాతక కృత్యాలకు పాల్పడుతున్న సంఘ విద్రోహక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. ఈ రకమైన విపరీత ధోరణులను ఉమ్మడిగానే ఎదుర్కోవాలని పిలుపునిచ్చింది. దేశంలో దళితులపై జరుగుతున్న దాడులకు సంబంధించి గురువారం లోక్‌సభలో జరిగిన విస్తృత చర్చ జరిగింది. రెండేళ్ల క్రితం కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో దళితులపై దాడులు తీవ్రమయ్యాయని సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, వామపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. ఈ చర్చకు సమాధానం చెప్పిన హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గోరక్షణ పేరుతో సంఘ విద్రోహక శక్తులు దాడులకు పాల్పడుతున్నాయన్నారు. ఇలాంటి విపరీత ధోరణులు కలిగిన వారిని కఠిన చర్యలతోనే అణచివేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉమ్మడిగానే ఈ రకమైన విషపూరిత ధోరణులను పారదోలేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. నిజానికి కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే దళితులపై దాడులు తగ్గాయని చెప్పిన హోం మంత్రి తన వాదనను సమర్థించుకుంటూ అందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. 2013లో దళితులపై దాడులకు సంబంధించి 39,346 కేసులు దాఖలయ్యాయని ఆ మరుసటి సంవత్సరానికి వీటి సంఖ్య 40,300కు పెరిగిందని చెప్పారు. అనంతర కాలంలో క్రమంగా తగ్గుతూ వచ్చాయని రాజ్‌నాథ్ వివరించారు. అయితే దళితులపై ఇంకా దాడులు జరుగుతున్నాయన్న వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిందేనని చెప్పిన హోం మంత్రి ‘వీటిని అరికట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇదే మన ముందున్న పెద్ద సవాలు’ అని చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా దళితులపై జరుగుతున్న దాడులకు సంబంధించి పార్లమెంట్‌లో చర్చించాల్సి రావడం విచారకరమన్నారు. దళితుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం ఏమీ చేయలేదన్న విపక్షాల వాదనను రాజ్‌నాథ్ కొట్టివేశారు. గత ఐదున్నర దశాబ్దాలలో అప్పటి ప్రభుత్వాలు చేయలేని పనిని తమ ప్రభుత్వం గత రెండు సంవత్సరాల కాలంలో చేసిందన్నారు. దళితులపై తీవ్ర స్థాయిలో దాడులు జరుగుతున్నప్పటికీ వీటిపై ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మాట్లాడలేదన్న విపక్షాల ప్రశ్నలకు జవాబిచ్చిన రాజ్‌నాథ్ ‘1947 నుంచి ఇప్పటి వరకూ వచ్చిన ప్రధాన మంత్రులు ప్రతి అంశంపైనా మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా..?’ అని ప్రశ్నించారు. ప్రధాని మాట్లాడినా మాట్లాడక పోయినా కూడా దళితులపై దాడులను అరికట్టాలన్నదే ఆయన ఉద్దేశమని స్పష్టం చేశారు. దాదాపు ఆరు గంటల పాటు జరిగిన ఈ చర్చలో సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు, ఆహార మంత్రి రామ్‌విలాస్ పాశ్వన్‌లు మాట్లాడారు. ‘దళితుల ఆరాధ్య దైవం బిఆర్ అంబేద్కర్‌ను అవమానించేందుకు చేయాల్సిందంతా చేశారు..’ అంటూ తీవ్ర నిరసనల మధ్య కాంగ్రెస్ సభ్యులనుద్దేశించి పాశ్వన్ అన్నారు.

చిత్రాలు..లోక్‌సభలో మాట్లాడుతున్న రాజ్‌నాథ్
పార్లమెంటు సమావేశాలను చూసేందుకు గుజరాత్ నుంచి వచ్చిన దళితులు