జాతీయ వార్తలు

అంగుళం కూడా పోనివ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 15: ‘పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగాన్ని సాధిస్తాం...అంగుళం కూడా పోనివ్వం..’ అని బిజెపి అగ్ర నాయకుడు, కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు తెలిపారు. కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని ఆయన అన్నారు. సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ సర్దార్ పటేల్‌ను ఈ రోజున ప్రత్యేకించి స్మరించుకోవాలని ఆయన సూచించారు. అలాగే స్వాతంత్య్ర సమరయోధులనూ స్మరించుకుందామని ఆయన చెప్పారు. మన దేశానికి కమ్యూనిజం, క్యాపిటలిజం ఏ మాత్రం సరిపోవని అన్నారు. జాతీయవాదం మనకు వేదం కావాలన్నారు. దేశంలో ఉన్న వారందరికీ అభివృద్ధి ఫలతాలు అందినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం లభించినట్లు అని ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లు చివరి వ్యక్తి వరకూ పథకాలు అందాలని అన్నారు. సమాజంలో కులాలు, మతాలు, జాతి పేరిట దేశాన్ని చీల్చే కుట్ర జరుగుతున్నదని ఆయన విమర్శించారు. మన వ్యవసాయక దేశంలో గోవును రక్షించుకోవాలని ఆయన చెప్పారు. గోరక్షకులు చట్టాన్ని చేతిలోకి తీసుకోరాదని ఆయన తెలిపారు.దళితులపై కొన్ని చోట్ల దాడులు జరుగడం బాధాకరం అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సాంఘిక దురాచారాలను రూపుమాపేందుకు చట్టాలను అమలు చేయడం ద్వారా, ప్రజల్లో చైతన్యం తేవడం ద్వారా సాధ్యమవుతుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు.
ఉగ్రవాద నిర్మూలనకు సహాయం: దత్తాత్రేయ
కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రసంగిస్తూ ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు కేంద్రం తెలంగాణకు సహాయం చేస్తుందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ అత్యధిక ప్రాధాన్తతనిస్తున్నారని ఆయన చెప్పారు. రెండేళ్ళలో తెలంగాణకు 96 వేల కోట్ల రూపాయలు ఇచ్చినట్లు ఆయన వివరించారు.బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ప్రసంగిస్తూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

చిత్రం.. హైదరాబాద్‌లోని బిజెపి కార్యాలయం వద్ద నిర్వహించిన ర్యాలీలో టూవీలర్ నడుపుతున్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, పార్టీ నేత లక్ష్మణ్, బండిపై కూర్చున్న కేంద్రమంత్రి దత్తాత్రేయ