జాతీయ వార్తలు

బక్షీ స్టేడియంలో ఎగరని జెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, ఆగస్టు 15: జమ్మూకాశ్మీర్‌లో జాతీయ పతకావిష్కరణలో అపశ్రుతి చోటుచేసుకుంది. శ్రీనగర్‌లోని స్టేడియంలో ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ జాతీయ జెండా ఆవిష్కరణ చేస్తుండగా ఒక్కసారిగా జెండా పడిపోయింది. ఆమె ముఖ్యమంత్రిగా తొలిసారి త్రివర్ణపతాకం ఎగురవేస్తుండగా ఈ ఘటన చోటుకేసుకోవడంతో అంతా హతాశురాలయింది. వెంటనే దీనిపై దర్యాప్తునకు ఆదేశించారు. జెండా నేలపై పడిపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కింద పడిపోయిన జాతీయ జెండాను ఇద్దరు భద్రతా సిబ్బంది పట్టుకోగా ఆమె కార్యక్రమాన్ని కొనసాగించారు. బక్షీ స్టేడియంలో జరిగిన ఈ అపశ్రుతిపై సిఎం తీవ్రంగా స్పందించి, విచారణకు ఆదేశించారని డిజిపి కె రాజేంద్ర కుమార్ వెల్లడించారు.