జాతీయ వార్తలు

నెల రోజుల్లో భూమివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉనా (గుజరాత్), ఆగస్టు 15: గుజరాత్ ప్రభుత్వం తమ డిమాండ్‌ను నెరవేర్చకుంటే ఆందోళనను ఉద్ధృతం చేయాలని దళితులు నిర్ణయించారు. గుజరాత్ ప్రభుత్వం నెల రోజులలోగా ఒక్కో దళిత కుటుంబానికి అయిదు ఎకరాల చొప్పున భూమిని మంజూరు చేయకపోతే భారీస్థాయిలో రైల్ రోకో కార్యక్రమాన్ని చేపడతామని స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఇక్కడ నిర్వహించిన నిరసన ప్రదర్శనలో దళితులు హెచ్చరించారు. వేలాది మంది దళితులు పాల్గొన్న ఈ సభలో దళిత నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపైనా విరుచుకుపడ్డారు. అత్యాచారాల నుంచి, వివక్ష నుంచి ఆజాదీ (స్వేచ్ఛ) కావాలంటూ, జైభీమ్ అంటూ నినదించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఆత్మహత్యకు పాల్పడిన దళిత స్కాలర్ రోహిత్ వేముల తల్లి రాధిక వేముల, ఇటీవల ఉనాలో దాడికి గురయిన ఒక బాధితుడి తండ్రి బాలు సర్వాయియా సంయుక్తంగా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జెఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ సమక్షంలో ఈ జాతీయ పతాకావిష్కరణ జరిగింది. ఉనా దళిత్ అతచియార్ లడత్ సమితి (యుడిఎఎల్‌ఎస్) నేతృత్వంలో అహ్మదాబాద్‌లో ప్రారంభమైన దళితుల ర్యాలీ వారం రోజుల పాటు సాగి సోమవారం ఉనాకు చేరుకుంది. ఇటీవల ఉనాలో చనిపోయిన ఆవుల చర్మం తీస్తున్న దళితులను గోసంరక్షకులు విపరీతంగా కొట్టిన విషయం తెలిసిందే. యుడిఎఎల్‌ఎస్‌ను స్థాపించి, ఈ నిరసన ర్యాలీకి నేతృత్వం వహించిన న్యాయవాది జిగ్నేష్ మేవాని బహిరంగ సభలో మాట్లాడుతూ పశువుల చర్మం వొలిచే వృత్తిని కొనసాగించబోమని ప్రతిన బూనాలని ఆయన సభకు తరలివచ్చిన వేలాది మంది దళితులకు పిలుపునిచ్చారు. ఉనాలో దాడి తరువాత పెద్దఎత్తున దళితులు ఉద్యమించడంతో తప్పనిసరి పరిస్థితిలోనే మోదీ పెదవి విప్పారని జగ్నేష్ విమర్శించారు. కన్హయ్య కుమార్ మాట్లాడుతూ మోదీ గొప్పగా చెప్పుకున్న గుజరాత్ నమూనా అభివృద్ధి గాలిబుడగను రాష్ట్ర దళితులు పంక్చర్ చేశారని అన్నారు. దేశంలో ఎక్కడ దళితులపై దాడి జరిగినా సహించబోమని అన్నారు.

చిత్రం.. గుజరాత్‌లోని ఉనాలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న దళిత నేతలు