జాతీయ వార్తలు

పేదల వైద్యానికి రూ.లక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 15: డెబ్భై ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేదలకు, స్వాతంత్య్ర సమర యోధులకు నజరానాలు ప్రకటించారు. చరిత్రాత్మక ఎర్రకోట సాక్షిగా ఆయన ప్రసంగిస్తూ దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదల కుటుంబాలకు వైద్య ఖర్చుల కోసం ఏడాదికి రూ.లక్ష రూపాయలు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. అదే విధంగా స్వాతంత్య్ర సమరయోధులకు ప్రస్తుతం ఇస్తున్న పింఛను రూ.25వేలను 20శాతం పెంచి ఇకపై రూ.30వేలకు పెంచుతున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న కొందరు యోధుల గురించి అవసరాన్ని మించి ఎక్కువగా చర్చిస్తున్నామని, గిరిజన వీరుల పాత్రను గురించి దేశానికి వెల్లడించటానికి వివిధ రాష్ట్రాలలో మ్యూజియంలను నిర్మించబోతున్నామని మోదీ ప్రకటించారు. ఎక్కువ పథకాలు ప్రకటించటం, బడ్జెట్ కేటాయింపులు జరపడంవల్ల ప్రజలు సంతృప్తి చెందరని.. సమర్థంగా అమలుచేసే ఒక్క పథకమైనా ప్రజలకు తృప్తినిస్తుందన్నారు. ఉదాహరణకు గతంలో పాస్‌పోర్టుల జారీకి నాలుగు నుంచి ఆరు నెలలు పట్టేదని, ఇప్పుడు ఒకటి రెండు వారాల్లోనే జారీ చేయగలుగుతున్నామన్నారు. 2015-16లో 1.75లక్షల పాస్‌పోర్టులు జారీ చేసినట్లు మోదీ వివరించారు. గతంలో ఎయిమ్స్ లాంటి అత్యున్నత ఆసుపత్రుల్లో రోగులు చేరేందుకు రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులు ఉండేవని.. ఇప్పుడు దాదాపు 40 అత్యున్నత ఆసుపత్రుల్లో రోగుల ప్రవేశాన్ని ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా చాలా తేలిక చేసామని ఆయన వివరించారు. రైల్వే వ్యవస్థ కూడా చాలా మెరుగుపడిందన్నారు. ‘‘అంతకుముందు 1500 కిలోమీటర్ల ట్రాక్ నిర్మాణానికి పదేళ్లు పట్టేది. ఇప్పుడు రెండేళ్లలో 3500 కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌ను నిర్మించాం. రోజుకు 7.8 కిలోమీటర్ల మేర రైల్వేట్రాక్‌ను నిర్మిస్తున్నాం. వచ్చే ఏడాదికల్లా రోజుకు 13 కిలోమీటర్ల ట్రాక్‌ను నిర్మాణ సామర్థ్యం పెరుగుతుంది’’ అని మోదీ స్పష్టం చేశారు. ఒకప్పుడు నిమిషానికి కేవలం రెండువేల టిక్కెట్లు మాత్రమే జారీ అయ్యేవని, ఇప్పుడు అదే సమయంలో 15వేల టిక్కెట్లు జారీ అవుతున్నాయన్నారు. దేశవ్యాప్తంగా రోజుకు 75 నుంచి 100 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం జరుగుతోందని మోదీ వివరించారు. అవినీతి నిరోధానికి గ్రూప్ సి, డి ఉద్యోగాలకు ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేసి ప్రత్యక్ష నియామక పద్ధతిని తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి పథకం ఫలితాలు చివరి వ్యక్తి వరకూ అందాలన్నదే తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు.

చిత్రం.. ఎర్రకోటపై జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ