జాతీయ వార్తలు

సమాజ మనుగడకు ఐక్యతే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 15: సామాజిక ఐక్యత లేకుండా సమాజం మనుగడ సాగించడం అసాధ్యమని, దీనిని దృష్టిలో ఉంచుకుని సామాజిక రుగ్మతలపట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇటీవల దళితులు, ముస్లింలపై దాడులు జరిగిన నేపథ్యంలో మోదీ సోమవారం ఎర్రకోట బురుజుల నుంచి చేసిన స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. సామాజిక న్యాయాన్ని పునాదిగా చేసుకుని సమాజం బలంగా లేకపోతే ఆర్థిక పురోగతికి హామీ ఉండదని ఆయన ఈ సందర్భంగా పేర్కొంటూ, దేశ ప్రజలంతా సామాజిక న్యాయం, సమానత్వం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏ దేశ పురోగతికైనా సామాజిక సామరస్యతే అత్యంత ముఖ్యమని, అందుకే అందరినీ సమదృష్టితో చూడాల్సిన అవసరం ఉందని జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత బిఆర్.అంబేద్కర్ లాంటి మహానుభావులతో పాటు అన్ని మతాల ప్రబోధకులు ఉద్ఘాటించారని మోదీ ఈ సందర్భంగా గుర్తుచేశారు. సమాజం ఐక్యంగా ఉండాలని రామానుజ ఆచార్యతో పాటు గౌతమ బుద్ధుడు, మహాత్మా గాంధీజీ, బిఆర్.అంబేద్కర్ వంటి మహానుభావులు, ఉపాధ్యాయులు మనకు బోధించారు. అంటరానివారు, అగ్ర, అథమ వర్ణాలుగా విడిపోయిన సమాజం మనజాలలేదు’ అని మోదీ పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లనుంచి కొనసాగుతున్న సామాజిక రుగ్మతల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ప్రధాని ఉదాఘటించారు. సామాజిక రుగ్మతలపై సమష్ఠిగా పోరాడి సంఘర్షణలకు తెరదించేందుకు ప్రభుత్వాలు, సమాజం కలసికట్టుగా కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు.