జాతీయ వార్తలు

ఈ ఏడాది 4 ప్రయోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, ఆగస్టు 15: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రంనుంచి ఈ ఏడాది నాలుగు ప్రయోగాలు చేపడుతున్నట్లు షార్ డైరెక్టర్ కున్హికృష్ణన్ పేర్కొన్నారు. సోమవారం ఆయన షార్‌లో జాతీయ జెండా ఆవిష్కరించించారు. అనంతరం కల్పన అంతరిక్ష నివాసంలో విలేఖర్లతో మాట్లాడుతూ షార్ కేంద్రం నుంచి ఈ ఏడాది రెండు జిఎఎస్‌ఎల్‌వి, ఒక పిఎస్‌ఎల్‌వి, మరో ఏటివి ప్రయోగం ఉంటుందన్నారు. సెప్టెంబర్ 10న రెండో ప్రయోగ వేదిక నుంచి జిఎస్‌ఎల్‌వి ఎఫ్ 045 రాకెట్ ద్వారా ఇన్‌చార్జి- 3 డిఆర్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు. ఆగస్టు చివరిలో ఏటివి సౌండింగ్ రాకెట్ ప్రయోగం ఉంటుందన్నారు.
ఇప్పటికే ఈ ప్రయోగ అనుమతికై నివేదికలు పంపినట్లు చెప్పారు. పిఎస్‌ఎల్‌వి సి-35 రాకెట్ ద్వారా స్కైశాట్‌తోపాటు విద్యార్థులు రూపొందించిన మరో రెండు ఉపగ్రహాలు, ఐదు విదేశీ ఉపగ్రహాలతో కలిపి మొత్తం 8 ఉపగ్రహాలు దీని ద్వారా నింగిలోకి పంపనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది చివరిలో జిఎస్‌ఎల్‌వి మార్క్-3 ప్రయోగం చేపడుతామన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఎస్-2 100, ఎల్-100 భూ స్థిర పరీక్షలు కూడా విజయవంతంగా పూర్తిచేశామన్నారు. డిసెంబర్‌కు మార్క్-3 పూర్తి స్థాయిలో రూపుదిద్దుకుంటుందన్నారు. దీని ద్వారా 25 టన్నుల బరువుగల ఉపగ్రహాన్ని స్వదేశీ క్రయోజెనిక్ ఇంజన్‌తో నింగిలోకి పంపేందుకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా పిఎస్‌ఎల్‌వి సి-36 ద్వారా సిశాట్ -19ఇ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపుతున్నట్లు తెలిపారు. ఇంతేగాకుండా వెహికల్ అసెంబ్లీ పనులు వేగవంగా జరుగుతున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది మొదట్లో వెహికల్ అసెంబ్లీని మరో దానిని తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఏడాదిలో మరిన్ని ప్రయోగాలు చేపట్టేందుకు ఇస్రో బృందం కృషి చేస్తుందన్నారు. దేశానికి గర్వకారణంగా నిలిచే దిక్సూచి వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడంతో సహా ఒకే పర్యాయం 20 ఉపగ్రహాలను పంపించి ప్రపంచ దేశాల సరసన నిలిచిన ఘనత ఇస్రోదన్నారు. కార్యక్రమంలో షార్ డైరెక్టర్ సారధి, పబ్లికేషన్ అధికారి విశ్వనాధశర్మ, తదితరులు పాల్గొన్నారు.