జాతీయ వార్తలు

పెట్రోలియం వర్శిటీ డిజిగా కిషన్‌కుమార్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 15: జెఎన్‌టియు హైదరాబాద్ రెక్టార్‌గా పనిచేసిన ఒఫెసర్ టి కిషన్ కుమార్ రెడ్డి గుజరాత్ గాంధీనగర్‌లోని పండిట్ దీన్ దయాల్ పెట్రోలియం యూనివర్శిటీ డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. వైస్ ఛాన్సలర్‌ను ఈ యూనివర్శిటీలో డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరిస్తారు. నరేంద్రమోదీ స్వయంగా ఈ యూనివర్శిటీ ఏర్పాటులో కీలక భూమికను పోషించారు. ప్రస్తుతం బోర్డు ఆఫ్ గవర్నర్స్ అధ్యక్షుడిగా ముఖేష్ అంబానీ వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ సెయింట్ పాల్ హైస్కూల్‌లో ప్రాధమిక విద్య పూర్తి చేసిన కిషన్‌కుమార్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఉన్నత విద్యను ఉస్మానియా యూనివర్శిటీ నుండి ఇంజనీరింగ్‌లోనూ గ్రాడ్యూయేట్ అయ్యారు. ఐఐటి మద్రాస్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసిన కిషన్ డ్రెక్సిల్ యూనివర్శిటీ నుండి మరో పిజి డిగ్రీ పూర్తి చేశారు.