జాతీయ వార్తలు

వైరమైనా.. వీడని బంధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 14: స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఆ రెండు దేశాల మధ్య స్పర్థలు కొనసాగుతూనే ఉన్నాయి.. రెండుసార్లు యుద్ధాలు సైతం జరిగాయి. సరిహద్దులో నిత్యం కాల్పులు జరుగుతూనే ఉన్నాయి... తమ ప్రాంతం ఆక్రమించారంటూ రెండు దేశాలూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ అంతర్జాతీయ సమాజం దృష్టికి వెళుతుంటాయి.. అవే భారత్, పాకిస్తాన్ దేశాలు.. అయితే ఇవేవీ ఈ రెండు దేశాల ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, స్నేహం, ఆహారపు అలవాట్లు, కళలు, సినిమాలు, బంధుత్వాలు, వివాహాలు, పేర్లు, రాకపోకలకు ఎంతమాత్రం అడ్డంకిగా ఉండవు. వైరమున్నా తమది వీడని బంధం అని చాటిచెపుతున్నారు ఈ రెండు దేశాల ప్రజలు. గుజరాత్ పేరుతో భారత్‌లో ఒక రాష్ట్రం ఉండగా, అదే పేరుతో పాకిస్తాన్‌లో ఒక జిల్లా ఉంది. హైదరాబాద్ పేరుతో మనదేశంలో ఒక నగరం ఉండగా, పాకిస్తాన్‌లోని సింధిలో హైదరాబాద్ నగరం ఉంది. అలాగే ఢిల్లీ గేట్ లాహోర్‌లో ఉండగా, లాహోర్ గేట్ పాటియాలలో ఉంది. పాకిస్తాన్‌కు చెందిన కరాచీ హల్వాను మనవారి అభిమాన స్వీట్‌గా మారగా, మన బెంగాలీ సమోసాను వారు లొట్టలేసుకుంటూ ఆరగిస్తారు. భారత్, పాకిస్తాన్ దేశ విభజన అనంతరం ఇక్కడ నుంచి పాకిస్తాన్‌కు కొంతమంది వలస పోగా, అక్కడి నుంచి భారత్‌కు వచ్చి చాలామంది స్థిరపడిపోయారు. రెండు దేశాల ప్రజలు ఇప్పటికీ ఒకరినొకరు వివాహం చేసుకుంటున్నారు. ఇరుదేశాల మధ్య ప్రజల మధ్య పురాతన కాలం నుంచి ఉన్న ఎన్నో సంప్రదాయాలు అలాగే కొనసాగుతూ వస్తున్నాయి. గత ఏడు దశాబ్దాలుగా పలు వీధులు, దుకాణాలు, కట్టడాలు, ఆహార పదార్థాలకు రెండు దేశాలకు చెందిన పేర్లతో ప్రసిద్ధిపొందాయి. భజ్వా, సేథి, రాథోర్, చౌదరి తదితర ఇంటిపీర్లు ఇరుదేశాల్లోనూ మనకు కన్పిస్తాయి. మనం చరిత్రను, భూగోళ శాస్త్రాన్ని ఎంతమాత్రం మార్చలేమని, ఇరుదేశాల మధ్య సంబంధాలు ఎలా ఉన్నా వాటి ప్రజల మధ్య పలు అంశాల్లో అవినాభావ సంబంధం ఉందని, పలు అలవాట్లు వారి జీవితాల్లో పెనవేసుకుని పోయి ఉన్నాయని ఇటీవల ‘ద పార్టిసన్ ఆఫ్ ఇండియా’ పుస్తకాన్ని రచించిన ఎడిటర్ అమిత్ రంజన్ పేర్కొన్నారు. అది ఎక్కడ తయారైనా గాని మనం కరాచి హల్వాను ఎంతో ఇష్టంగా తింటామని, ఇప్పుడు పాకిస్తాన్‌తో విభేదాలు ఏర్పడినంత మాత్రాన దాని పేరును మార్చుకుందామా, ఇప్పుడు దానిని ఢిల్లీ హల్వా అనో పాటియాల హల్వా అనే పిలుద్దామా అని ఆయన ప్రశ్నించారు. పంచదార, మైదా, నీరు తదితర పదార్థాలతో తయారు చేసినంత మాత్రాన అన్నింటికీ కరాచి హల్వా రుచి వస్తుందా అని అన్నారు. కాగా, మన ఆహార పదార్థాల్లో సైతం పలు పాకిస్తాన్ పేర్లతో ఉండటాన్ని మనం గమనించే ఉంటాం. ఫుడ్ యాప్ స్విగ్గీలోకి వెళ్లి సెర్చ్ చేస్తే మనకు 15కు పైగా రెస్టారెంట్లు చికెన్ పెషావరి, చికెన్ లాహోరి, పాకిస్తాన్ చికెన్ బిరియాని, పన్నీర్ టిక్కా, మల్తాని వంటి పాకిస్తాన్ పేర్లున్న ఆహార పదార్థాల లిస్టు కన్పిస్తుంది. ఉపఖండంలోని సంస్కృతిలో పెనవేసుకుపోయి ఉన్న చాలా అంశాలను మనం తుడిచివేయలేమని పలువురు చరిత్రకారులు అంటున్నారు. మన దేశానికి చెందిన మద్రాస్ జ్యూయలర్స్‌కు పాకిస్తాన్‌లో పలు బ్రాంచిలున్నాయి. బొంబాయి చౌపట్టి రెస్టారెంట్‌కు పాక్‌లోని లాహోర్, ఇస్లామాబాద్, గుజరాత్, ఫైసలాబాద్, కరాచిలో బ్రాంచిలున్నాయి.