జాతీయ వార్తలు

ఎవరిది బ్రహ్మాస్త్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈసారి జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల సమరం అనుకూల ప్రతికూల అంశాల మిశ్రమంగా కురుక్షేత్ర సంగ్రామాన్ని తలపింపజేస్తోంది. వరుసగా రెండోసారి కూడా కేంద్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో, అనేక రాష్ట్రాల్లో సొంత ప్రభుత్వాలున్న బలంతో మోదీ సారథ్యంలోని బీజేపీ దూకుడుగానే ముందుకుపోతోంది. అలాగే భావసారూప్యత కలిగిన అనేక ప్రతిపక్ష పార్టీల సంఘటిత బలం తిరుగులేని శక్తిగా రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ కూడా మరింత ఉత్సాహంతో కదనానికి సిద్ధమవుతోంది. అయితే బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ అటు కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీల మహాకూటమి.. ఈ రెంటిలో దేనికి ప్రజల మొగ్గు ఉంటుంది. ఏ కూటమిని వారు అందలం ఎక్కించే అవకాశం ఉందన్నది ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఏప్రిల్ 11 నుంచి లోక్‌సభతో పాటు, పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఈసారి సమర విశే్లషణ మరింత సంక్లిష్టంగానే మారే అవకాశం ఉంది. గత నెల 14 ముందు వరకు దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్రమోదీ పట్ల ప్రతికూల భావనే ఉంది. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ సహా అనేక నిర్ణయాలు ప్రజలపై ప్రతికూల ప్రభావాన్ని కనబర్చడం ఇందుకు ప్రధాన కారణమే అయినప్పటికీ పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు జరిగిన వైమానికి దాడితో ఒక్కసారిగా పరిస్థితి తారుమారైందన్న భావన బలంగా ఏర్పడింది. అంటే పాకిస్తాన్‌లోని ఉగ్రమూకలను చిత్తుచేయడం ద్వారా ప్రధాని మోదీ తన పలుకుబడిని ఒక్కసారిగా పెంచేసుకోగలిగారని చెబుతున్నప్పటికీ అత్యంత సంక్లిష్టమైన అంశాలతో ముడిపడి ఉన్న ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై దీని ప్రభావం అంతంగా ఉండే అవకాశం కనిపించడం లేదు. 2014లో అజేయమైన బలంతో కేంద్రంలో అధికారాన్ని చేపట్టిన అనంతరం జరిగిన అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయాన్ని సొంతం చేసుకుంటూ వచ్చిన బీజేపీ గత ఏడాది మొదట్నుంచీ ప్రాభవాన్ని కోల్పోతూ వచ్చింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి మూడు కీలక రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయింది. ఈ మూడుచోట్లా కాంగ్రెస్ గద్దెనెక్కడంతో వీటి ప్రభావం లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంది. పాకిస్తాన్‌లోని బాలాకోట్‌పై జరిపిన వైమానికి దాడి కొంతమేర మోదీ పలుకుబడిని పునరుద్ధరించినప్పటికీ మళ్లీ బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు అది ఎంతమేరకు దోహదం చేస్తుందన్నది సందేహమే. అయితే ఆర్థిక పరమైన చిక్కులెన్నో ఉన్నా, జాతీయ భద్రతకే ఈ ఎన్నికల్లో జనం మొగ్గుచూపే అవకాశం ఉందని, ఆ విధంగా మోదీ మళ్లీ గద్దెనెక్కే అవకాశం ఉందన్న వాదనలో వాస్తవమెంతో వేచి చూడాల్సిందే. బాలాకోట్ అంశాన్ని ఆలంబనగా చేసుకొని విపక్షాల తీరును ఎండగట్టే విధంగా బీజేపీ నాయకత్వం చేస్తున్న ప్రయత్నాలు ఎంతమేరకు ఆ పార్టీకి ఓట్లను తెచ్చిపెడతాయన్నది కూడా రాజకీయంగా ఉత్కంఠను రేకెత్తిస్తోంది. బాలకోట్ దాడికి సంబంధించిన వౌలిక అంశాలపై ప్రతిపక్షాలు సంధిస్తున్న ప్రశ్నలను దేశ భద్రతకు విఘాతం కలిగించేదిగా ప్రచారం చేయడం ద్వారా ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ కృషి చేస్తోంది. ప్రతిపక్షాలను జాతి వ్యతిరేకమైనదిగా చిత్రీకరించడం ద్వారా జాతీయ భద్రతనే ప్రధాన ప్రచారాస్త్రంగా ముందుకు తీసుకు వెళ్లేందుకు బీజేపీ సన్నద్ధమవుతోంది. అయితే సైనికపరమైన దాడులు దేశీయంగా జరిగే ఎన్నికలపై ఏ విధమైన ప్రభావాన్ని చూపిస్తాయన్నదానిపై మిశ్రమ ఫలితాలపై వచ్చిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మోదీ వర్సెస్ రాహుల్ సమరంలో విజేతలెవరు? వారి విజయానికి దోహదం చేసే అంశాలు ఏమిటన్నది ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. గత ఏడాదిన్నరగా కాంగ్రెస్ పార్టీ విజయ పరంపర కొనసాగిస్తూ గతంలో ఒకదాని తర్వాత ఒకటి కోల్పోయిన రాష్ట్రాలను కాంగ్రెస్ సమంగా చేజిక్కించుకుంటోంది. కానీ బీజేపీ పరిస్థితి భిన్నంగా ఉంది. ఈ అనుకూల ప్రతికూలతలు ఎవరికి సానుకూలమో తేలే తరుణం ఆసన్నం కానుంది.