జాతీయ వార్తలు

ఆర్థిక నేరగాళ్లే లబ్ధిదారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రిస్సూర్ (కేరళ), మార్చి 14: బీజేపీ హయాంలో వంద మందికి 30 నుంచి 40 మందికి మాత్రమే బ్యాంకింగ్ సేవలు అందుతున్నామని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎక్కువ మందికి రుణాలు లభించేటట్లు చర్యలు తీసుకుంటామని ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చర్యల వల్ల బ్యాంకు సేవల వల్ల కొంత మంది మాత్రమే లబ్ధిపొందుతున్నారని ఆయన అపహాస్యం చేశారు. బ్యాంకింగ్ రంగాన్ని కొంత మంది తమ ఆధీనంలోకి తెచ్చుకుని శాసిస్తున్నారని ఆయన అన్నారు. ఈ రోజు మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థను విశే్లషించండి. కేవలం 40శాతం మందికి మాత్రమే బ్యాంకు వల్ల లబ్ధిచేకూరుతోందన్నారు. ఆయన గురువారం ఇక్కడ మత్స్యకార సంఘాల ప్రతినిధుల సభలో ప్రసంగించారు. ఇటీవల హిందీబెల్ట్‌లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు. ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతుల రుణాలను మాఫీ చేశాయన్నారు. కాని దీనిని బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. అనిల్ అంబానీ లాంటి బడాపారిశ్రామికవేత్తలకు మాత్రమే నరేంద్రమోదీ హయాంలో రుణాలు ఇస్తున్నారన్నారు. రైతులకు రుణాలు ఇస్తే పనిచేయరనే వాదనలో పసలేదన్నారు. రైతులకు ప్రతి ప్రభుత్వం ముందుకు వచ్చి ప్రాధాన్యత ప్రకారం రుణాలు ఇవ్వాలన్నారు. దేశంలో 15 మంది ధనవంతులకు మాత్రమే 3.5 లక్షల కోట్ల రుణాలు ఇచ్చారన్నారు. ప్రజల సొమ్మును ఆర్థిక నేరగాళ్లు దోపిడీ చేసేందుకు మోదీ సర్కార్ లైసెన్సు ఇచ్చిందన్నారు. అనిల్ అంబానీ రూ.45వేల కోట్ల రుణాలు తీసుకున్నారని ఆరోపించారు. నీరవ్ మోదీకి రూ.35వేల కోట్ల రుణాలు, విజయ్‌మాల్యాకు రూ.10వేల కోట్ల రుణాలు ఇచ్చారన్నారు. వీరిలో ఇద్దరు వ్యక్తులు దేశం వదిలిపారిపోయారన్నారు. ఇదే సొమ్మును ఉపాధి నిమిత్తం యువకులకు ఇచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. కేరళలో ఒక యువకుడికి రూ.30 లక్షల బ్యాంకు రుణం ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారన్నారు. అదే నీరవ్‌మోదీకి రూ.35వేల కోట్లు ఇచ్చినా ఉపయోగం లేదని, సంపదను కాజేసి పరారయ్యాడన్నారు. కనీస ఆదాయం గ్యారంటీ స్కీంను తమ ప్రభుత్వం ప్రవేశపెడుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు. జీఎస్‌టీ పన్ను వల్ల ప్రజలపై భారం పడిందన్నారు. సంక్లిష్టమైన పన్ను విధానాన్ని మార్చుతామన్నారు.

చిత్రం.. జాలర్ల పార్లమెంట్‌లో సన్మానం అందుకుంటున్న రాహుల్