జాతీయ వార్తలు

తేలు కుట్టిన దొంగలా పాక్ పరిస్థితి: వెంకయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోయంబత్తూరు, మార్చి 14: పాకిస్తాన్ ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడంతో పాటు వారికి ఉగ్రవాద కార్యకలాపాల్లో శిక్షణ ఇస్తోందని ఉప రాష్టప్రతి ఎం.వెంకయ్య నాయుడు మండిపడ్డారు. భారత వాయుసేన ఇటీవల వైమానిక దాడులు జరిపిన తరువాత పాకిస్తాన్ పరిస్థితి తేలు కుట్టిన దొంగలా తయారయిందని ఆయన పేర్కొన్నారు. గురువారం ఇక్కడ ఒక ప్రైవేటు కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్‌లోని ఉగ్రవాదుల శిక్షణ శిబిరాలపై విజయవంతంగా వైమానిక దాడులు చేసిన భారత బలగాలను ఆయన అభినందించారు. ‘మన పొరుగు దేశం పరిస్థితి వారు అంగీకరించలేనిదిగా, ఏమి చేయకుండా ఊరుకోకుండా ఉండలేనిదిగా ఉంది’ అంటూ ఆయన ‘తేలు కుట్టిన దొంగలా’ అనే తెలుగు సామెతను పాకిస్తాన్‌కు అన్వయించారు.