జాతీయ వార్తలు

ఉగ్రవాదాన్ని సమూలంగా అంతమొందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 15: ఉగ్రవాదం పెనుభూతంగా మారుతోందని అందరూ కలిసి ఉగ్రవాదాన్ని సమూలంగా అంతమొందించాలని ఉప రాష్టప్రతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ఐక్యరాజ్య సమితి శాంతి విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని వెంకయ్య నాయుడికి శుక్రవారం ఆత్కూరులోని స్వర్ణ్భారత్ ట్రస్ట్‌లో ఆత్మీయులు కంభంపాటి హరిబాబు, కామినేని శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ తదితరులు చిరు సత్కారం చేశారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ తీవ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలను ఏకాకులను చేసి నిధులను ఆపి సహాయ నిరాకరణ చేయాలన్నారు. ప్రపంచంలోని చాలా దేశాలు ఉగ్రవాదం అనే పెనుభూతాన్ని ఎదుర్కొంటున్నాయని అందువల్ల అన్ని దేశాలకు పరిస్థితులు అర్థమై ఉగ్రవాదంపై గట్టిగా మాట్లాడుతున్నాయన్నారు. చైనా మాత్రం మర్యాద, సంస్కృతి, సాంప్రదాయాలను మరచి తనకున్న అధికారంతో ఉగ్రవాదంపై చర్యకు అడ్డంకులు కల్పిస్తోందన్నారు. శాంతి విశ్వవిద్యాలయం తనకు ఇచ్చిన గౌరవ డాక్టరేట్ వ్యక్తిగతంగా వచ్చినది కాదని భారతీయ ప్రజలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. గతంలోను, ప్రస్తుతం చాలా యూనివర్శిటీలు డాక్టరేట్లు ఇస్తామని ముందుకు వస్తున్నాయని అధికారంలోకి ఉండి తీసుకోకూడదని సున్నితంగా వారి అభ్యర్థనను తిరస్కరించానన్నారు. అయితే కోస్టారికా దేశంలోని శాంతి విశ్వవిద్యాలయం శాంతి, సమత, విలువలు, అభివృద్ధికి సూచికగా ప్రపంచం ఇచ్చిన గుర్తింపు అని, అధికారుల సూచనల మేరకు స్వీకరించానన్నారు.