జాతీయ వార్తలు

అధికారమిస్తే.. ఆరోగ్య చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌పూర్, మార్చి 15: దేశంలోని అందరికి కనీస ఆరోగ్య సంరక్షణకు భరోసా ఇస్తూ త్వరలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల సందర్భంగా విడుదల చేసే తమ పార్టీ మేనిఫెస్టోలో ఆరోగ్య హక్కు చట్టాన్ని తీసుకువస్తామనే హామీని పొందుపరిచే అంశాన్ని తమ పార్టీ పరిశీలిస్తోందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఆరోగ్య పథకం ఆయుష్మాన్ భారత్‌ను ఆయన నిశితంగా విమర్శించారు. దేశంలోని 15 నుంచి 20 మంది ఎంపిక చేసిన వ్యాపారవేత్తలకు ఆర్థికంగా లబ్ధి చేకూర్చడానికి ప్రవేశపెట్టిన పథకమే ఆయుష్మాన్ భారత్ అని ఆయన ఆరోపించారు. ఒక స్వచ్ఛంద సంస్థ ‘అందరికీ ఆరోగ్యం’ అంశంపై నిర్వహించిన రెండు రోజుల జాతీయ సదస్సు ముగింపు సెషన్‌లో వైద్య నిపుణులతో ఇష్టాగోష్టిగా జరిపిన భేటీలో రాహుల్ మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ‘మా మేనిఫెస్టోలో పొందుపరచడానికి ఆరోగ్య సంరక్షణ చట్టంసహా మూడు అంశాలను పరిశీలిస్తున్నాం. ఆరోగ్య హక్కు చట్టం ద్వారా భారత ప్రజలందరికి కనీస ఆరోగ్య సంరక్షణకు సంబంధించి భరోసాను కల్పించగలం అని ఆయన అన్నారు. వైద్య నిపుణులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ, మన ఆరోగ్య సంరక్షణ వ్యయాన్ని దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో మూడు శాతానికి పెంచడంతో పాటు వైద్యులు, ఇతర ఆరోగ్య సంరక్షణ నిపుణుల సంఖ్యను పెంచడం ద్వారా అందరికి కనీస ఆరోగ్య సంరక్షణను కల్పించవచ్చని తెలిపారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆరోగ్య సంరక్షణ, విద్యారంగాలపై వ్యయాన్ని పెంచడంపై దృష్టి కేంద్రీకరిస్తుందని రాహుల్ గాంధీ చెప్పారు. ‘్భరత్ గ్రామీణ వ్యవస్థ నుంచి పట్టణ వ్యవస్థ దిశగా పరివర్తన చెందుతోంది. ఈ పరివర్తన పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ పరివర్తన ప్రజలను బాధించేదే తప్ప అంత సులభంగా జరిగేది కాదు’ అని ఆయన అన్నారు. మూడు ముఖ్యమయిన అంశాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఏ ప్రభుత్వమయినా 21వ శతాబ్దంలో భారత పౌరులను పరిరక్షించవలసి ఉందని పేర్కొన్నారు. ‘మొదటిది మనం నిరుద్యోగ సమస్యను పరిష్కరించవలసి ఉంది. రెండోది మనం తక్కువ వ్యయంతో ఎక్కువ నాణ్యమయిన విద్యను అందించవలసి ఉంది. మూడోది మనం మెరగయిన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను అందించవలసి ఉంది’ అని రాహుల్ గాంధీ వివరించారు. ‘ఈ మూడు అంశాలు కూడా నాకు రాజీపడదగినవి కాదు. మనం ఈ మూడింటిని చేయకపోతే విజయం సాధించలేము’ అని ఆయన అన్నారు.