జాతీయ వార్తలు

అన్ని సీట్లలోనూ గెలుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, మార్చి 18: రాష్ట్రంలో వచ్చేనెల 11న జరిగే 13 లోక్‌సభ నియోజకవర్గాలకు జరిగే ఎన్నికల్లో తమ పార్టీ ఘన విజయం సాధిస్తుందని కాంగ్రెస్ గట్టి ధీమా, నమ్మకంతో ఉంది. అదే సమయంలో ప్రతిపక్ష కూటమిగా పోటీ చేస్తున్న శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ), ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ), భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తమ సత్తా చూసి కలవరపాటుకు గురవుతున్నాయని కాంగ్రెస్ పార్టీ పంజాబ్ వ్యవహారాలు పర్యవేక్షిస్తున ఇన్‌చార్జి ఆశా కుమారి వ్యాఖ్యానించారు. ‘ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎస్‌ఏడీ, బీజేపీ, ఏఏపీలతో కూడిన ప్రతిపక్ష కూటమి ప్రచార సరళిని గమనిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. అకాలీదళ్, ఆమ్ ఆద్మీ పార్టీల్లో సీట్ల విషయంలో అప్పుడే లుకలుకలు ప్రారంభమయ్యాయని ఆమె పేర్కొన్నారు. అదే సమయంలో ఆ మూడు పార్టీల భాగస్వామి కూటమిలోని బీజేపీలో సైతం క్యాడర్ కోసం అంతర్గత పోరు జరుగుతోందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 13 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయ కేతనం ఎగురవేస్తుందనే గట్టి నమ్మకాన్ని ఆమె కనబరిచారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు సమర్ధవంతంగా చేరవేయడంలో కృతకృత్యులయామని ఆమె అభిప్రాయపడ్డారు. అదే సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న అనేక ప్రజావ్యతిరేక విధానాల గురించి ప్రజలకు సమగ్రంగా వివరించడంలో తమ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎంతో కృషి చేశారని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ రైతులకు రుణ మాఫీని ప్రకటించడంతోపాటు యువజనులకు స్మార్ట్ఫోన్లను అందజేస్తూ మభ్యపెడుతున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ, శిరోమణి అకాలీదళ్ పార్టీలు ఇప్పటికే తమ పలుచోట్ల జరిగిన ప్రచారాల్లో ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాయి. ఈ కూటమి నేతలు రంజిత్ సింగ్ బ్రహ్మపుర, రత్తన్ సింగ్ అజ్నాలా, సేవా సింగ్ సెఖ్‌వాన్ ఆయా పార్టీల నుంచి గత ఏడాది బహిష్కరణకు గురయ్యారు. అంతేకాకుండా శిరోమణి అకాలీదళ్ సీనియర్ నాయకుడు సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా సైతం పార్టీ పదవులకు గత ఏడాది సెప్టెంబర్‌లో రాజీనామా చేశారు. అంతేకాకుండా శిరోమణి అకాలీదళ్ మతసంబంధ వివాదాలతోపాటు డేరా సచ్చా సౌదా చీఫ్‌కు క్షమాభిక్ష విషయంలో తలదూర్చడంతో ఆ పార్టీకి ఎన్నో తలవంపులు తీసుకువచ్చాయి. అదేసమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతల్లో సైతం ఐక్యత కొరవడడం రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీకి కలిసొచ్చే అంశమని కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 2014లో దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ హవా కొనసాగుతున్న సమయంలోనూ పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 4 లోక్‌సభ స్థానాల్లో విజయకేతనం ఎగురవేశామని, ఇపుడు మోదీ హవా క్రమేణా క్షీణిస్తున్న నేపథ్యంలో 13 పార్లమెంటు స్థానాల్లోనూ తమ పార్టీ ఘన విజయం సాధిస్తుందనే గట్టి ధీమాను ఆ పార్టీ నాయకులు వ్యక్తం చేశారు.