జాతీయ వార్తలు

కాంగ్రెస్‌తో పొత్తు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 18: ఢిల్లీలోని ఏడో లోక్‌సభ స్థానానికి సైతం అభ్యర్థిని ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ తమకు కాంగ్రెస్‌తో ఎలాం టి పొత్తు లేదని మరోసారి స్పష్టం చేసింది. తాము మొత్తం ఏడు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించామని, అందులో ఎవరినీ తగ్గించే ప్రసక్తే లేదని ఆ పార్టీ సీనియర్ నేత గోపాల్ రాజ్ సోమవారం తెలిపారు. ఈనెల రెండో తేదీన ఆమ్ ఆద్మీ పార్టీ ఆరు లోక్‌సభ స్థానాలకు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఆఖరికి ఆదివారం ఆ పార్టీ తమ ఏడో అభ్యర్థిని సైతం వెల్లడించింది. తొలుత ఆ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుంటందని భావించారు. అయితే కాంగ్రెస్ పార్టీ నేతల వైఖరి, వారి ప్రకటనల పట్ల ఆప్ నేతలు అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సైతం పొత్తుకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదు. దీంతో ఢిల్లీలో పోటీపై కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తమకు అన్పించడం లేదని, అందుకే పొత్తుల విషయంలో ఆ పార్టీ నుంచి స్పందన లేదని పేర్కొన్న ఆప్ తామే సొంతంగా పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది. ఇలావుండగా, ఢిల్లీలో పోటీకి కాంగ్రెస్, బీజేపీలు ఇంతవరకు తమ అభ్యర్థులను ప్రకటించలేదు. తొలుత కాంగ్రెస్-ఆప్ మధ్య ఎన్నికల పొత్తు ఉంటుందని అందరూ భావించారు. అయితే తమ బూత్ స్థాయి కార్యకర్తలు, నేతల అభిప్రాయాలు సేకరించారు. వారు సైతం పొత్తు వల్ల ఇరు పార్టీలకు మేలు జరుగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలోని ఏడు లోక్‌సభ నియోజకవర్గాలకు తమ అభ్యర్థులను ప్రకటించింది. ఈ ఏడు స్థానాలకు మే 12న ఎన్నికలు జరుగుతాయి.