జాతీయ వార్తలు

గోవా కొత్త సీఎం ప్రమోద్ సావంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ, మార్చి 18: క్రోమగ్రంధి క్యాన్సర్‌తో మరణించిన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ వారసుడెవరన్న ఉత్కంఠకు బీజేపీ నాయకత్వం తెరదించింది. పార్టీ సీనియర్ నాయకుడైన ప్రమోద్ సావంత్‌ను ముఖ్యమంత్రిగా నియమించనున్నట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో బీజేపీ మైనారిటీలో పడిందని, ప్రభుత్వ ఏర్పాటుకు తమనే ఆహ్వానించాలంటూ కాంగ్రెస్ నడుం బిగించిన నేపథ్యంలో బీజేపీ ఆకస్మిక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్రమోద్ సావంత్ గోవా అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్నారు. మిత్రపక్షాలైన గోవా ఫార్వార్డ్ పార్టీ అధినేత విజయ్ సర్దేశాయ్, అలాగే మహారాష్టవ్రాది గోమంత పార్టీ ఎమ్మెల్యే సుధిన్ భవాలికర్‌లకు ఉపముఖ్యమంత్రి పదవులను కట్టబెట్టారు. మిత్రపక్షాలతో జరిగిన అధికార పంపిణీలో ప్రకారమే ఉప ముఖ్యమంత్రి పదవులను ఇవ్వడం జరిగిందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో కొన్ని గంటలపాటు బీజేపీ నాయకత్వం సమావేశాల పరంపర నిర్వహించింది. మొత్తమీద మిత్రపక్షాలు తాము అనుకున్నది సాధించుకోవడంతో సంక్షోభానికి తెరపడింది. పారికర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఉప ముఖ్యమంత్రి పదవే లేదు. అయితే, ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితులను అధిగమించే వ్యూహంలో భాగంగా మిత్రపక్షాలకు ఈ పదవులు కట్టబెట్టడం జరిగిందని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

చిత్రం.. గోవా కొత్త సీఎం ప్రమోద్ సావంత్