జాతీయ వార్తలు

ఇండిపెండెంట్‌గా సుమలత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మార్చి 18: కర్నాటకలోని మాండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని దివంగత కాంగ్రెస్ నేత అంబరీష్ సతీమణి సుమలత నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణంలో ఆమెకు సీటు దక్కలేదు. సమీకరణల్లో భాగంగా టికెట్ ఇవ్వడానికి కాంగ్రెస్ నిరాకరించింది. పొత్తుల్లో భాగంగా మాండ్య సీటు జేడీఎస్‌కు కేటాయించారు. ఇక్కడ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు పోటీచేయనున్నాడు. అంబరీష్ సతీమణి, నటి సుమలత సోమవారం మీడియాతో మాట్లాడుతూ ‘నా కోసం నా కుమారుడి కోసం ఎన్నికల్లో నిలబడడం లేదు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి బలమైన కారణం ఉంది. మాండ్య ప్రజలు, జిల్లా అభివృద్ధి అలాగే అంబరీష్ అభిమానుల కోసం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించకున్నా’ అని ఆమె ప్రకటించారు. భర్తను కోల్పోయి పుట్టెడు బాధతో ఉన్న తనకు మాండ్య ప్రజలు ఓదార్పును అందించారని, వారి రుణం తీర్చుకోడానికే ఎంపీగా పోటీ చేస్తున్నట్టు ఆమె స్పష్టం చేశారు. ‘నియోజకవర్గ ప్రజలు నా పట్ల, నా కుమారుడు అభిషేక్ పట్ల చూపుతున్న ప్రేమ, అభిమానాలే నన్ను ఎన్నికల్లో పోటీచేసేలా పురిగొల్పాయి’ అని సుమలత వెల్లడించారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలందరూ తనవెంటే ఉన్నారని, తనకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని ఆమె చెప్పారు. ఈ నెల 20న నామినేషన్ దాఖలు చేస్తానని ఆమె ప్రకటించారు.