జాతీయ వార్తలు

అధికార పల్లకీ.. తూర్పు యూపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్రంలో అధికారంలోకి రావాలంటే యూపీలో మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవడమే ఏకైక మార్గమని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయ. 1951 నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రాంతమే కేంద్రంలో అధికారాన్ని సంపాదించుకోవడంలో ఆయా పార్టీలకు కేంద్ర బిందువు అయింది. 2014 ఎన్నికల్లో అమిత్ షా రాజకీయ వ్యూహం ఫలించి తూర్పు యూపీలో బీజేపీ ప్రభంజనానే్న కొనసాగించింది.
*
దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అత్యధిక స్థాయిలో 80 లోక్‌సభ స్థానాలు కలిగిన రాష్ట్రం కూడా ఇదే. ఇక్కడ మెజార్టీ సీట్లను ఏ పార్టీ గెలుచుకుంటే కేంద్రంలో అధికార పీఠాన్ని అంతగా దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. గత లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ తిరుగులేని అధికారాన్ని సంతరించుకోవడానికి ప్రధాన కారణం ఉత్తరప్రదేశ్‌లో గణనీయ సంఖ్యలో లోక్‌సభ సీట్లను గెలుచుకోగలగడమే. అమిత్ షా సారథ్యంలో బీజేపీ గత ఎన్నికల మాదిరిగా యూపీలో లోక్‌సభ సీట్లను స్వీప్ చేస్తుందా? అలాగే రాహుల్ గాంధీ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు తన ప్రాబల్యాన్ని పెంపొందించుకోగలుగుతుంది? ప్రాంతీయంగా అత్యంత శక్తివంతమైన బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీలు ఎంత మేరకు ఈ రెండు జాతీయ పార్టీలను నిలువరించగలుగుతాయి అన్నది దేశ వ్యాప్తంగా ఉత్కంఠను రేకెత్తిస్తోంది. అయితే ఉత్తరప్రదేశ్‌లో తూర్పు ప్రాంతంలోనే 32 లోక్‌సభ స్థానాలున్నాయి. రాజకీయంగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అలహాబాద్, వారణాసి, ఘోరక్‌పూర్, బాలియా తదితర కీలక స్థానాలకు ఈ ప్రాంతమే కేంద్ర బిందువు. అందుకే కేంద్రంలో అధికారంలోకి రావాలంటే యూపీలోనే మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవడమే ఏకైక మార్గమని భావిస్తున్న రాజకీయ పార్టీలు ఇక్కడి సీట్లపైనే దృష్టి పెట్టాయి. 1951 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రాంతమే కేంద్రంలో అధికారాన్ని సంపాదించుకోవడంలో ఆయా పార్టీలకు కేంద్ర బిందువు అయింది. ఈ ప్రాంతం ప్రజలు బలపరిచిన పార్టీయే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన సందర్భాలు గణనీయంగానే ఉన్నాయి. ముఖ్యంగా తూర్పు యూపీలో తన బలాన్ని కొనసాగించుకున్నంత కాలమే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోనూ అధికార పీఠాన్ని అధిష్టించగలిగింది. అయితే ఈ ప్రాంతంపై కాంగ్రెస్ పట్టు కోల్పోవడం, మాయావతి, ములాయం సింగ్ సారథ్యంలో బీఎస్పీ, సమాజ్‌వాదీ పార్టీలు పట్టు సంపాదించడంతో కాంగ్రెస్ చతికిలబడే పరిస్థితి ఏర్పడింది. అలాగే మొన్నటి ఎన్నికల వరకూ కూడా బీజేపీకి రాష్ట్ర రాజకీయాల్లో అంత పట్టులేని పరిస్థితి. మొదటి లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 469 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీ 364 సీట్లను గెలుచుకుంది. 1971లో జరిగిన లోక్‌సభ ఎన్నికల వరకు కూడా ఉత్తర యూపీమై ఇదే ప్రాబల్యాన్ని కాంగ్రెస్ కొనసాగించింది. 1977 నాటికి సీను మారిపోయింది. అవిభాజ్య యూపీలో కేవలం ఆరు సీట్లను మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. 1977లో జరిగిన ఎన్నికల్లో తూర్పు యూపీ ప్రజలు జనతాపార్టీని బలపరిచారు. అందుకే ఆ పార్టీ ఘన విజయం సాధించింది. అదే 1980లో జరిగిన ఎన్నికల్లో ఈ ప్రాంత ప్రజల మన్ననలను తిరిగి పొందగలిగిన కాంగ్రెస్ మళ్లీ అధికారాన్ని పొందగలిగింది.
అందుకే కేంద్రంలోను అధికారాన్ని సంతరించుకోగలిగింది. 1984 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 404 సీట్లు రావడం వెనక తూర్పు యూపీ ప్రజలు ఇచ్చిన కీలక మద్దతే కారణం అని చెప్పవచ్చు. 1991 నాటికి భారతీయ జనతాపార్టీ ఈ ప్రాంతంపై మంచి పట్టును సంపాదించి వారణాసి, ఘోరక్‌పూర్ తదితర కీలక సీట్లను గెలుచుకోగలిగింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఈ ప్రాంతంలో 5 సీట్లు మాత్రమే లభించాయి. అయితే ఇతర రాష్ట్రాల్లో గెలుచుకున్న సీట్ల బలంతో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. 1996 నాటికి ఈ ప్రాంతంలో బీజేపీ బలం పెరిగింది. కేవలం 13రోజులు మాత్రమే వాజ్‌పేయి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ఆ పార్టీ విజయం వెనక ఈ ప్రాంతంలో సంపాదించిన సీట్లే కీలకం అని చెప్పవచ్చు. 2014 ఎన్నికల్లో అమిత్‌షా రాజకీయ వ్యూహం ఫలించి తూర్పు యూపీలో బీజేపీ ప్రభంజనానే్న కొనసాగించింది. వరుసగా రెండోసారి కూడా కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న పట్టుదలతో వున్న మోదీ ఈ ప్రాంతంలోనే అనేకసార్లు పర్యటించారు. ఇక్కడే వున్న తన నియోజకవర్గమైన వారణాసిలో ఈ ఐదేళ్ల కాలంలో 19సార్లు మోదీ పర్యటించారు. అగ్రవర్ణాలు ఓబీసీ ఓటర్లు 26 నియోజక వర్గాల్లో నిర్ణయాత్మక భూమిక పోషించే అవకాశం ఉంది. తాజాగా ప్రియాంక కూడా ఈ ప్రాంతంపైనే దృష్టి పెట్టడం కాంగ్రెస్ పార్టీకి ఏ మేరకు కలిసి వస్తుంది? కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న రాహుల్ గాంధీ ఆశయం తూర్పు యూపీలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లను తెచ్చిపెడుతుందన్నది రాజకీయంగా ఉత్కంఠను కలిగించే అంశమే. మొత్తం మీద ఎన్నిక ఏదైనా తూర్పు యూపీపై పట్టు సాధించిన వారిదే కేంద్రంలో అధికారమన్నది నిజం.

చిత్రాలు.. నరేంద్ర మోదీ (బీజేపీ) *రాహుల్ (కాంగ్రెస్) *మాయావతి (బీఎస్పీ) *అఖిలేషష్ (ఎస్పీ)