జాతీయ వార్తలు

పేదల ఖాతాల్లో నెలకు రూ.1500

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, మార్చి 19: తమిళనాడులోని అధికార పార్టీ ఏఐఏడీఎంకే మంగళవారం తన ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. పేదలకు ప్రతి నెలా 1500 రూపాయలను నేరుగా వారి ఖాతాల్లో జమ చేసే అమ్మ నేషనల్ పావర్టీ ఎరాడికేషన్ ఇనిషియేటివ్ (ఏఎన్‌పీఈఐ) పథకంతో పాటు తాము అధికారంలోకి వస్తే రాజీవ్‌గాంధీ హత్య కేసు దోషులు ఏడుగురిని విడుదల చేస్తామని, వైద్య విద్య ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్షను రద్దు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. ఇక్కడ జరిగిన విలేఖరుల సమావేశంలో ఏఐఏడిఎంకె కో-ఆర్డినేటర్, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్తున్నట్టు ప్రకటించారు. అమ్మ ఆశయాలకు అనుగుణంగా, పేదల సంక్షేమానికి తమ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న అనేకమంది పేదలను ఆదుకునేందుకు పేదరిక నిర్మూలన పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఈ పథకం కింద ఎలాంటి ఆదాయం, ఆధారం లేని మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, భూమి లేని రైతు కూలీలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివసించే కూలీలు, ఒంటరి వృద్ధులకు నెలకు నేరుగా 1500 రూపాయలను వారి ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. ఇప్పటికే తాము అమలు చేస్తున్న అమ్మ సబ్సిడీ కేంటీన్లు, ఇతర పథకాలను కొనసాగిస్తామని చెప్పారు. తాము మద్దతు ఇచ్చిన పార్టీ కేంద్రంలో అధికారం చేపడితే రాజీవ్ గాంధీ హత్యకేసుకు సంబంధించి శిక్ష అనుభవిస్తున్న ఏడుగురు ఖైదీలను విడుదల చేయాలని గవర్నర్‌కు ఆదేశాలు ఇవ్వాలని రాష్టప్రతి, భారత ప్రభుత్వాన్ని కోరుతామని, ఈ విషయమై తమిళనాడు కేబినెట్ ఇప్పటికే సిఫార్సు చేస్తూ గవర్నర్ పురోహిత్‌కు తీర్మానం పంపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే కావేరి-గంగా నదుల అనుసంధానం చేయిస్తామని, విద్యార్థుల విద్యారుణాలను రద్దు చేయిస్తామని ఆయన చెప్పారు.

చిత్రం.. అన్నాడీఎంకే మేనిఫెస్టో విడుదల చేస్తున్న తమిళనాడు
సీఎం, డిప్యూటీ సీఎం పళనిస్వామి, పన్నీర్ సెల్వం