జాతీయ వార్తలు

కర్నాటకలో కుప్పకూలిన నాలుగంతస్థుల భవనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మార్చి 19: ఉత్తర కర్ణాటకలోని ధార్వాడ్‌లో మంగళవారం నిర్మాణంలో ఉన్న ఒక నాలుగంతస్థుల భవనం కూలి ఇద్దరు మృతి చెందారు. భవనం శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారని భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పెద్ద శబ్దంతో భవనం కూలుతున్నప్పుడు ఒక్కసారిగా ఇరుగుపొరుగు వారు, దాని సమీపం నుంచి వెళ్తున్న వారు భయాందోళనలకు గురయ్యారని పోలీసులు తెలిపారు. ‘ఇద్దరు మృతి చెందారు. మరో 30 నుంచి 40 మంది భవనం శిథిలాల కింద చిక్కుకొని పోయారు’ అని ధార్వాడ్ పోలీస్ స్టేషన్‌లోని ఒక పోలీసు అధికారి తెలిపారు. నలుగురిని శిథిలాల కింది నుంచి బయటకు తీసుకు రావడం జరిగిందని, ఇతరులను రక్షించడానికి సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని పోలీసులు చెప్పారు. సహాయక చర్యలు కొనసాగించడానికి 10 ఆంబులెన్సులు, అయిదు అగ్నిమాపక శకటాలను రంగంలోకి దించారు. నిర్మాణంలో ఉన్న భవనం కూలిన ఘటన తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి తెలిపారు. సహాయక చర్యలను పర్యవేక్షించాలని, ధార్వాడ్‌కు ప్రత్యేక విమానంలో మంచి అనుభవం ఉన్న సహాయక సిబ్బందిని పంపించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిని ఆదేశించినట్టు సీఎం చెప్పారు.
చిత్రం..కర్నాటకలోని ధార్వాడలో కుప్పకూలిన భవనం