జాతీయ వార్తలు

అధికారమిస్తే ప్రత్యేక హోదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటానగర్: కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఈశాన్య రాష్ట్రాలన్నింటికీ ప్రత్యేక హోదాను పునరుద్ధరిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ ఈశాన్య రాష్ట్రాల ప్రజలపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సిద్ధాంతాలను రుద్దడం ద్వారా వారి సామాజిక, సాంస్కృతిక విధానాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తోందని రాహుల్ ఆరోపించారు. లోక్‌సభ, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మంగళవారం ఇక్కడి ఇందిరా పార్క్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఈశాన్య ప్రాంతాల ప్రజల మనోభావాలకు పెద్దపీట వేశారు. తమ పార్టీ ఎన్నడూ ఈశాన్య రాష్ట్రాల ప్రజల భాష, సంస్కృతి, ఆచార, సంప్రదాయాలపై దాడి చేయలేదని పేర్కొన్నారు. ‘ఈ ప్రాంత ప్రజలు కాంగ్రెస్ హృదయానికి చాలా దగ్గరగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడింది. నా పార్టీ అధికారంలోకి వస్తే, అరుణాచల్ ప్రదేశ్‌కు, ఇతర ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను పునరుద్ధరిస్తుంది’ అని రాహుల్ భరోసా ఇచ్చారు. ఈశాన్య భారతంలోని కాంగ్రెస్ పార్టీ చివరి కోట మిజోరం నవంబర్‌లో చేజారింది.
బీజేపీ మిత్ర పక్షమయిన మిజో నేషనల్ ఫ్రంట్ మిజోరంలో భారీ ఆధిక్యంతో అధికారంలోకి వచ్చింది. కొన్ని రాష్ట్రాలకు అనుసంధానం లేకపోవడం, కొండప్రాంతం, వౌలిక సదుపాయాల లేమి వంటి ప్రత్యేక సమస్యలు ఉండటం వల్ల ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అవసరం ఉందని రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రాలు ప్రత్యేక హోదాను అనుభవించాయని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ నినాదాన్ని ఆయన ప్రస్తావిస్తూ, ప్రధాన ప్రతిపక్షం పట్ల వారి విద్వేషానికి ఈ నినాదం చిహ్నమని అన్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ లౌకిక పార్టీ కాబట్టి బీజేపీ నాశనం కావాలని కోరుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాలు సహా దేశం మొత్తం మీద ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాన్ని రుద్దుతోందని ఆయన ఆరోపించారు. సంఘ్ పరివార్ నేపథ్యం కలిగిన అనర్హులు వైస్ చాన్సలర్లుగా నియమితులయ్యారని ఆయన విమర్శించారు. మరో సున్నిత అంశమయిన పౌరసత్వ (సవరణ) బిల్లును ఆయన ప్రస్తావిస్తూ, ఈ బిల్లు ఈ ప్రాంత ప్రజలకు వినాశకరమయిందని, అందువల్ల తమ పార్టీ ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందకుండా చూస్తుందని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.

చిత్రం..ఇటానగర్‌లో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో సంప్రదాయ దుస్తుల్లో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ