జాతీయ వార్తలు

ప్రజలు మూర్ఖులు కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీర్జాపూర్ (ఉత్తరప్రదేశ్), మార్చి 20: ప్రజలు మూర్ఖులుకారని, ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తెలుసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా వ్యాఖ్యానించారు. తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ఇన్‌ఛార్జిగా సేవలు అందిస్తున్న ఆమె గంగా నదిలో మూడు రోజుల పడవ ప్రయాణం, ప్రచారంలో భాగంగా బుధవారం ఇక్కడికి చేరుకున్నారు. నది ఒడ్డున ఉన్న స్థానికులను కలుస్తూ, వారితో మేమేకమవుతూ, అక్కడ ఏర్పాటు చేస్తున్న ప్రచార సభల్లో పాల్గొంటూ ఆమె తీరిక లేకుండా ఉన్నారు. వచ్చేనెల 11న మొదలయ్యే సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకొని, ఆమె విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. మీర్జాపూర్‌లో ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ఆర్‌బీఐ, సీబీఐ వంటి ప్రతి సంస్థనూ తన గుప్పిట్లోకి తీసుకోవాలని మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అన్ని విభాగాలపై దాడులకు తెగించారని వ్యాఖ్యానించారు. ‘మీరంతా భాగస్వాములుగా ఉన్న సంస్థలపై కూడా మోదీ పెత్తనం చెలాయిస్తున్నారు. ఇది మంచి పద్దతి కాదు. ప్రజలు మూర్ఖులనీ, వారికి ఏమీ తెలియదని ప్రధాని అనుకుంటున్నారు. కానీ, వారు అన్నీ గమనిస్తునే ఉన్నారు. వారికి అన్నీ అర్థమవుతున్నాయి’ అన్నారు. తమను మోదీ వేధిస్తున్నారంటూ, తన భర్త రాబర్డ్ వాద్రాపై వచ్చిన ఆరోపణలు, జరుగుతున్న విచారణను ఆమె ప్రస్తావించారు. కానీ, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని, మోదీ ప్రయత్నాలకు భయపడబోమని ప్రియాంక స్పష్టం చేశారు. ప్రధాని ఎంత ఎక్కువగా వేధిస్తే, తాము అంతకు రెట్టింపు బలంతో ప్రతిఘటిస్తామని అన్నారు. దేశాభివృద్ధికి మోదీ సర్కారు ఏమీ చేయడం లేదని విమర్శించారు. మిఠాయిలు పంచుతూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నదంటూ, కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన కిసాన్ వికాస్ వంటి కొన్ని పథకాలను పరోక్షంగా ప్రస్తావించారు. దేశాభ్యుదాయాన్ని, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రాజకీయాలు చేయాలేగానీ, దేశ భవిష్యత్తును నాశనం చేసే విధంగా ఉండరాదని ప్రియాంక వ్యాఖ్యానించారు. మోదీ సర్కారు ఉద్యోగితా శాతాన్ని పెంచలేకపోయిందని విమర్శించారు. అన్ని రకాలుగానూ విఫలమైన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారును గద్దెదించి, కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వాలని ఆమె పిలుపునిచ్చారు. అప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా రైతులకు మేలుచేసే పథకాలను ప్రవేశపెట్టి, దేశంలో వృద్ధి రేటు పెరిగేలా చూస్తామని ప్రియాంక హామీ ఇచ్చారు.
చిత్రం.. ప్రచార కార్యక్రమంలో భాగంగా బుధవారం వారణాసి అస్సీఘాట్ చేరుకున్న ప్రియాంక గాంధీ