జాతీయ వార్తలు

జమ్మూ కాశ్మీర్‌లో పొత్తులు ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 20: లోక్‌సభ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్‌లో కలిసి పోటీ చేస్తున్న కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల నేతలు బుధవారం తమ పొత్తుల విషయాన్ని ఖరారు చేశారు. జాతీయ స్థాయి అవసరాలు, లౌకిక శక్తుల ప్రగతి దృష్ట్యా ఈ పొత్తుల ఆవశ్యకత ఏర్పడిందని ఆ ఈ సందర్భంగా చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేత గులాంనబీ ఆజాద్, నేషనల్ కాన్ఫరెన్స్ ముఖ్యనేత నేత ఫరూక్ అబ్దుల్లా ఈమేరకు విలేఖరులతో మాట్లాడారు. జమ్మూ, ఉదంపూర్ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ తలపడుతుందని, అలాగే శ్రీనర్ నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ పోటీ చేస్తుందని ఈ సందర్భంగా నేతలు ప్రకటించారు. అలాగే అనంతనాగ్, బారాముల్లా నియోజకవర్గాల్లో మాత్రం రెండు పార్టీల మధ్య స్నేహపూర్వక పోటీ ఉంటుందని స్పష్టం చేశారు. ఇక లడక్ లోక్‌సభ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలనే విషయంపై చర్చలు సాగుతున్నాయని ఫరూక్ అబ్దుల్లా వివరించారు. పాకిస్తాన్ నుంచి పెనుసవాళ్లు ఎదురవతున్న తరణంలో జమ్మూ కాశ్మీర్‌లో లౌకికవాద శక్తుల విజయానికి, దేశ ప్రజల అభీష్టానికి అనుగుణంగా తాము పొత్తులు పెట్టుకుంటున్నామని గులాం నబీ ఆజాద్ తెలిపారు. ‘బతుకు బతికించు’ అనే నినాదంతో ఇలా అత్యుత్తమ నిర్ణయాన్ని తమ పార్టీలు తీసుకున్నాయన్నారు. తమలో ఏపార్టీ గెలిచినా అది ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా జరిగిందని భావిస్తామని ఆజాద్ పేర్కొన్నారు. అంతిమంగా బీజేపి లాభపడకూడదన్నదే తమ లక్ష్యమన్నారు. శ్రీనగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ పడుతున్న ఫరూక్ అబ్దుల్లాకు కాంగ్రెస్ నేతలంతా ప్రచారం చేస్తారన్నారు. ప్రస్తుతం ఈ స్థానం నుంచే అబ్దుల్లా లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

చిత్రం.. జమ్మూలో బుధవారం జరిగిన విలేఖరుల సమావేశంలో పాల్గొన్న
కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా