జాతీయ వార్తలు

మెజారిటీ నిరూపించుకున్న గోవా ముఖ్యమంత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ, మార్చి 20: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ బుధవారం అసెంబ్సీలో మెజారిటీని నిరూపించుకున్నారు. బీజేపీ నాయకత్వంలోని సర్కారును మనోహర్ పారేకర్ ముందుండి నడిపించారు. ఇటీవల ఆయన మృతి చెందడంతో, సావంత్‌ను ఆ స్థానంలో ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం సావంత్ అసెంబ్లీలో తమ పార్టీ బలాన్ని నిరూపించుకోవాల్సి ఉండింది. బుధవారం ఆయన అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకున్నారు. బీజేపీకి చెందిన 11 మంది సభ్యులతోపాటు గోవా ఫార్వర్డ్ పార్టీ నుంచి ముగ్గురు, ఎంజీపీ నుంచి మరో ముగ్గురు సభ్యులు కూడా సావంత్‌కు మద్దతు పలికారు. ముగ్గురు ఇండిపెండెంట్లు కూడా ఆయనకు అనుకూలంగా ఓటు వేశారు. డిప్యూటీ స్పీకర్ మైఖేల్ లోబో అసెంబ్లీ కార్యకలాపాలను పర్యవేక్షించారు. కాగా, కాంగ్రెస్‌కు చెందిన 14 మంది, ఎన్‌సీపీకి చెందిన ఒక సభ్యుడు సావంత్ బలపరీక్షలో ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేశారు. కానీ, మెజారిటీ సభ్యులు సావంత్‌ను బలపరచడంతో, బల పరీక్ష నెగ్గింది.
పారికర్‌కు ఘన నివాళి
గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మృతి పట్ల అసెంబ్లీ ఘనంగా నివాళులు అర్పిస్తూ తీర్మానం చేసింది. కొత్తగా ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ పారికర్ చేసిన సేవలను కొనియాడారు. గోవాను అభివృద్ధి చేశారని, అనేక సంస్కరణలను ప్రవేశపెట్టారన్నారు. ఈ రోజు తాను ఎమ్మెల్యేగా ఎన్నికై ముఖ్యమంత్రిగా ఉన్నానంటే, దానికి పారికర్ కారణమన్నారు. తాను పారికర్‌కు ఎంతో రుణపడి ఉన్నానని చెప్పారు. దార్శనికత ఉన్న నేత అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజేష్ పట్నాకర్ మాట్లాడుతూ పారికర్‌తో తన స్నేహ సంబంధాలను తెలిపారు. ప్రతిపక్ష నేత చంద్రకాంత్ కావేల్కర్ మాట్లాడుతూ దేశ రక్షణ శాఖ మంత్రిగా పారికర్ సేవలు నిరుపమానమని చెప్పారు. అభివృద్ధి అజెండాగా, గోవా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నిరంతరం పాటుపడ్డారన్నారు. మహరాష్టవ్రాది గోమంతక్ పార్టీ ఎమ్మెల్యే సుదీన్ దావాల్కేర్ మాట్లాడుతూ, జురీ నదిపై నిర్మిస్తున్న వంతెనకు పారికర్ పేరు పెట్టాలని సూచించారు. గోవా ఫార్వర్డ్ పార్టీ ఎమ్మెల్యే విజయ్ సర్దేశాయ్ మాట్లాడుతూ ప్రజల హృదయాలను గెలిచిన నేత పారికర్ అని కొనియాడారు.