జాతీయ వార్తలు

హింజిలీ నుంచి నవీన్ పట్నాయక్ నామినేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెర్హంపూర్ (ఒడిశా), మార్చి 20: ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గంజాం జిల్లా, హింజిలీ అసెంబ్లీ నియోజకవర్గం స్థానం నుంచి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. బిజూ జనతాదళ్ (బీజేడీ) పార్టీ అధ్యక్షుడి హోదాలో ఇదే స్థానం నుంచి నవీన్ పట్నాయక్ వరుసగా ఐదోసారి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన రెండు అసెంబ్లీ స్థానాల నుంచి బరిలోకి దిగనున్నారు. బీజపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇదే విషయాన్ని బుధవారం హింజిలీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా నవీన్ పట్నాయక్ ప్రస్తావిస్తూ త్వరలో బీజపూర్ అసెంబ్లీ స్థానానికి కూడా నామినేషన్ వేయనున్నట్టు తెలిపారు. హింజిలీ, బీజపూర్ రెండు స్థానాలకు ఏప్రిల్ 18న రెండో విడత సందర్భంగా ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రంలో రెండో విడత నామినేషన్లు దాఖలు చేయడానికి ఆఖరు తేదీ మార్చి 26. లోక్‌సభతోపాటు అసెంబ్లీకి జరిగే ఎన్నికలకు నవీన్ పట్నాయక్ బీజేడీ అభ్యర్థిగా తొలిసారి నామినేషన్ దాఖలు చేశారు. హింజిలీ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేసిన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడుతూ గంజాంలోని జిల్లా ప్రధాన కేంద్రంలో చత్రాపూర్ అసిస్టెంట్ సబ్‌కలెక్టర్ ఎస్.ఎన్.నాయక్‌కు తన నామినేషన్ పత్రాలు అందజేసినట్టు తెలిపారు. ఇదిలావుండగా, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ సందర్భంగా నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేసినట్టు సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. అంతకుముందు నవీన్ పట్నాయక్ ఇక్కడికి సమీపంలోని తారాతరణి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పించారు.
చిత్రం.. బర్హంపూర్‌లోని చత్రాపూర్‌లో బుధవారం తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందచేస్తున్న బిజూ జనతాదళ్ అధ్యక్షుడు, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్