జాతీయ వార్తలు

ఎన్‌సీపీకి షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 20: మహారాష్టల్రో శరద్‌పవార్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)కి భారీ షాక్ తగిలింది. ఎన్‌సీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రంజిత్ సిన్హా మొహితే పాటిల్ బీజేపీలో చేరారు. పాటిల్ ఎవరోకాదు ఎన్‌సీపీ సీనియర్ నేత విజయ్ సిన్హా మొహితే పాటిల్ కుమారుడే. ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవీస్ సమక్షంలో రంజిత్ బుధవారం బీజేపీలో చేరారు. విజయ్‌సిన్హా పాటిల్ ఎన్‌సీపీ లోక్‌సభ సభ్యుడు. అలాగే గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తారు. అధినాయకత్వం తీరునచ్చకే బీజేపీలో చేరానని మాజీ రాజ్యసభ సభ్యుడు రంజిత్ సిన్హా తెలిపారు. ఎన్నికల వేళ ఎన్‌సీపీకి పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇటీవలే మహారాష్ట్ర ప్రతిపక్ష నేత రాధాకృష్ణ వీఖే పాటిల్ కుమారుడు సుజయ్ వీఖే పాటిల్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే కుమారుడు సుజయ్ వేరే పార్టీలోకి చేరినందున నైతిక బాధ్యత వహిస్తూ ప్రతిపక్ష నేత పదవికి రాధాకృష్ణ రాజీనామా చేస్తారన్న కథనాలు వెలువడ్డాయి.