జాతీయ వార్తలు

విశాఖ నుంచి పురంధ్రీశ్వరి.. టిక్కెట్టు దక్కని దత్తాత్రేయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత ఎంపీ బండారు దత్తాత్రేయకు అధినాయకత్వం లోక్‌సభ టికెట్ నిరాకరించింది. దత్తాత్రేయ స్థానంలో మరో సీనియర్ నాయకుడు జీ.కిషన్ రెడ్డి సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుండి పోటీ చేస్తారని కేంద్ర మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుండి పోటీచేసే పది మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. కరీంనగర్ నుండి బండి సంజయ్, నిజామాబాద్ నుండి డి.అరవింద్, మల్కాజ్‌గిరి నుండి ఎన్.రామచందర్‌రావు, సికింద్రాబాద్ నుండి జి.కిషన్‌రెడ్డి, మహబూబ్ నగర్ నుండి డీకే అరుణ పోటీ చేస్తారు. అరుణ కేవలం రెండు రోజుల క్రితమే బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. నాగర్‌కర్నూల్ నుండి బంగారు శృతి పోటీ చేస్తారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ కుమార్తె శృతిని నాగర్‌కర్నూలు రిజర్వు నియోజకవర్గం నుండి పోటీ పెట్టటం గమనార్హం. నల్గొండ నుండి జి.జితేంద్రర్ కుమార్, భువనగిరి నుండి పీవీ శ్యామసందర్ రావు పోటీ చేస్తారు. వరంగల్ టికెట్ చింతా సాంబమూర్తికి లభించింది. మహబూబాబాద్ స్థానానికి హసన్ నాయక్‌ను ఎంపిక చేశారు.
నరసరావుపేట నుంచి కన్నా
ఆంధ్రప్రదేశ్‌లో మొదటి విడతలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ఇద్దరు అభ్యర్థులను బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం లోక్‌సభ స్థానానికి మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరిని ప్రకటించారు. అలాగే నరసరావుపేట లోక్‌సభ స్థానానికి ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను బరిలోకి దించారు. విశాఖపట్నం సిట్టింగ్ లోక్‌సభ సభ్యుడిగా ఉన్న కంభంపాటి హరిబాబును అధిష్ఠానం పక్కనపెట్టింది. గతంలో తెలుగుదేశం పొత్తులో భాగంగా 2014 ఎన్నికల్లో పురంధ్రీశ్వరి రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి మిధున్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న శాసనసభ స్థానాలకు 123 మంది అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించిన అధిష్టానం మిగిలిన శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి వుంది. అలాగే ఏపీలోని 23 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించాల్సి వుంది.