జాతీయ వార్తలు

ఓడినా.. గెలిచినా.. ఖర్చు కామనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికలు అంటేనే ప్రచారం.. ప్రచారం అంటే ఖర్చు.. ఈ రెండూ లేకుండా ఏ అభ్యర్థి కూడా జనం దగ్గరికి వెళ్లలేడు. వెళ్లినా గెలవలేడు. పంచాయతీ ఎన్నికల నుంచి లోక్‌సభ ఎన్నికల వరకు ఏ పార్టీ అభ్యర్థి అయినా అందలం ఎక్కాలనుకుంటాడు. ఆ అందలం కోసం ఎంతైనా ఖర్చుపెడతాడు. అయితే ఈ ఖర్చుకో పరిమితి ఉంటుందని, అది దాటితే వేటు తప్పదని ప్రతి ఎన్నికకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీచేస్తూనే ఉంటుంది. మరి ఆ పరిమిత రీతిలోనే ఎన్నికల ఖర్చు జరుగుతోందా? ఇటు ర్యాలీలు.. అటు రోడ్ షోలు నిర్వహించేందుకు అయ్యే ఖర్చెంత అన్నది ఎవరికీ, ఎప్పటికీ అంతుపట్టనిదే. దేశ రాజకీయాల్లో అత్యంత కీలక భూమిక పోషిస్తున్న మహారాష్టల్రో ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ప్రచారం కోసం భారీగానే ఖర్చు జరుగుతోంది. అయితే వాటిలో సగం మొత్తం కూడా అధికారికంగా వెల్లడి కావడం లేదన్న వాదన వినిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో నియోజకవర్గాల పరిధి చాలా ఎక్కువ కాబట్టి ఏ పార్టీ అభ్యర్థి అయినా.. చివరికి ఇండిపెండెంట్ అభ్యర్థి అయినా, ఓటర్లను కలుసుకోవాలంటే అయ్యే ఖర్చు తీవ్రంగానే ఉంటుంది. ర్యాలీలు, సమావేశాలు, రోడ్ షోలు వీటిలోఏది నిర్వహించాలన్నా 50 వేల రూపాయల నుంచి లక్షల్లోనే ఉంటుంది. ఇక పెద్ద నాయకుడ్ని తీసుకురావాలంటే ఆ ఖర్చుకు అంతే ఉండదు. అయితే ఎంత ఖర్చయిందో ఏ అభ్యర్థీ బయట పెట్టకపోవడానికి కారణం ఎన్నికల కమిషన్ ఆంక్షలే. రాష్ట్రాల్లో లోక్‌సభకు పోటీచేసే అభ్యర్థుల 50 లక్షల నుంచి 70 లక్షల వరకు ఖర్చు చేసేందుకు ఎన్నికల కమిషన్ అనుమతిస్తోంది. ఏ ఎన్నికల్లోనైనా ప్రచారం అనేది నాలుగు విధాలుగా ఉంటుంది. ఇంటింటి ప్రచారం ఒకటయితే, రోడ్ షోలు రెండోది. బహిరంగ సభలు, కూడళ్లలో సమావేశాలు మిగతా వరుసలోకి వస్తాయి. అయితే గంటల తరబడి జరిగే రోడ్‌షోల ఖర్చు కనీస పక్షంగా లక్షతో మొదలై 7 లక్షలు దాటిపోతుందని రాజకీయ కార్యకర్తలే చెబుతున్నారు. తమ వెంట ఉండే కార్యకర్తల ఖర్చును తిండితో సహా భరించాల్సి అభ్యర్థే. ఇవి చిన్న చిన్న ఖర్చులే అయినా.. మొత్తం ప్రచారం ముగిసే నాటికి వీటి భారం భారీగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఏ అభ్యర్థి అయినా రోజువారీగా ఒకటి రెండు బహిరంగ సభల్లో మాట్లాడతారు. రాష్ట్రంలో మామూలుచోట అయితే ఈ ఖర్చు పరిమితంగానే ఉన్నప్పటికీ పెద్ద పెద్ద మైదానాల్లో వీటిని నిర్వహించాలంటే లక్షలు దాటిపోతుందని చెబుతున్నారు. కుర్చీలు వేయానికి అయ్యే ఐదు రూపాయల ఖర్చు నుంచి ప్రతిదీ కూడా వందల వేల రెట్లు పెరిగిపోతూనే ఉంటుందని చెబుతున్నారు. ఎంతగా ప్రచారం జరిగితే అంతగానూ ఓటర్లకు చేరువయ్యేందుకు, వారిని ఆకట్టుకునేందుకు వీలు ఉంటుందని ఏ అభ్యర్థి అయినా, ఏ పార్టీ అయినా భావిస్తుంది. పిండికొద్దీ రొట్టె అన్నట్టు ప్రచారం కోసమే నువ్వు ఎంత ఖర్చుపెట్టగలిగితే అంతగానూ పేరు మారుమోగేందుకు ఓటర్ల నాలుకలపై తన పేరు నానేందుకు అంతిమంగా అతడు కనికరిస్తే ఓటు పడేందుకు అవకాశం ఉంటుంది.
అందుకే రాష్ట్రం ఏదైనా నియోజకవర్గం ఎలాంటిదైనా లోక్‌సభ బరిలో దిగాలంటే తడిసి మోపెడయ్యే ఖర్చును భారమైనా భరించి తీరాల్సిందే. ఓడినా గెలిచినా ఈ ఖర్చు మాత్రం ఆయా అభ్యర్థులకు తప్పదు. అయినప్పటికీ కూడా ఓడిపోవడానికి ఎవరూ పోటీ చేయరు కాబట్టి గెలుపే ధ్యేయంగా సాగే ఈ ప్రచార యుద్ధంలో విజేతలకైనా పరాజితులకైనా ఖర్చు తప్పనిసరి.