జాతీయ వార్తలు
ఏ పార్టీకీ ప్రచారం చేయను
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, మార్చి 21: త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో తాను ఏ రాజకీయ పార్టీ నుంచి పోటీ కాని, ప్రచారం కాని చేయబోనని బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ స్పష్టం చేశారు. తమ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి సల్మాన్‌ఖాన్‌తో మాట్లాడుతున్నామని మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ నేత ఒకరు పేర్కొనడంపై స్పందించిన సల్మాన్ గురువారం ఈ మేరకు ట్వీట్ చేస్తూ ‘ఈ వార్తలన్నీ రూమర్లు.. నేను ఈ ఎన్నికల్లో ఏదైనా పార్టీ నుంచి పోటీ కాని, ప్రచారం కాని చేయడం లేదు’ అని ట్వీట్ పేర్కొన్నారు. కాగా మంగళవారం కాంగ్రెస్ అధికార ప్రతినిధి పంజక్ చతుర్వేది విలేఖరులతో మాట్లాడుతూ తమ పార్టీ నేతలు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ప్రచారం చేయాల్సిందిగా హీరో సల్మాన్‌ఖాన్‌తో ఇదివరకే చర్చలు జరిపారని, ఆయన అక్కడ ప్రచారం చేయడం ఖాయమని పేర్కొన్నారు. కాగా, 2009లో ఇండోర్ మేయర్ స్థానానికి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన పంకజ్ సింఘ్వీకి మద్దతుగా సల్మాన్‌ఖాన్ రోడ్‌షో నిర్వహించారు. అయితే ఆ ఎన్నికల్లో పంకజ్.. బీజేపీ నేత కృష్ణమురళీ మోఘి చేతిలో ఓటమి పాలయ్యారు.