జాతీయ వార్తలు

ఒడిశా సీఎం ఆస్తుల విలువ రూ.63.87 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బరంపురం (ఒడిశా), మార్చి 21: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు రూ. 63.87 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. కాని నగదు మాత్రం రూ. 25వేలు ఉన్నట్లు ఎన్నికల సంఘంకు ఇచ్చిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. చత్రాపూర్ రిటర్నింగ్ ఆఫీసర్ వద్ద దాఖలు చేసిన నామినేషన్లతో తన ఆస్తుల వివరాల అఫిడవిట్లను ఇచ్చారు. నవీన్‌పట్నాయక్‌కు 1980 మోడల్ అంబాసిడర్ కారు ఉంది. దీని వెల రూ. 8905. మొత్తం ఆస్తుల్లో చరాస్తులు రూ. 2,36కోట్ల విలువను కలిగి ఉన్నాయి. వారసత్వంగా వచ్చిన స్థిరాస్తి విలువ రూ. 63.64 కోట్లు ఉన్నాయి. స్థిరాస్తుల్లో సోదరుడు, సోదరికి వాటాలు ఉన్నాయి. తనకు వార్షికాదాయం 2017-18లో రూ. 21.17 లక్షలని పేర్కొన్నారు. బ్యాంకు వడ్డీ, వేతనం ద్వారా ఈ ఆదాయం వచ్చినట్లు ఆయన చెప్పారు. తనకు బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్‌బీఐ బ్రాంచిలో ఖాతాలు ఉన్నాయని పేర్కొన్నాయి. పట్నాయక్ తన వద్ద 45.770 గ్రాముల బంగారం ఉందని పేర్కొన్నారు. ఫరీదాబాద్‌లో వ్యవసాయ భూమి, భవనం ఉన్నట్లు చెప్పారు. ఇక్కడ మొత్తం 22.7 ఎకరాల భూమి ఉంది. దీని మార్కెట్ విలువ రూ.10.75 కోట్లని చెప్పారు. న్యూఢిల్లీలో 2.133 ఎకరాల విస్తీర్ణంలో నవీన్ నివాస్ ఉంది. దీని మార్కెట్ విలువ రూ.9.52 కోట్లని చెప్పారు. తనపై ఏ కోర్టులో కూడా క్రిమినల్ కేసులు లేవని పేర్కొన్నారు.