జాతీయ వార్తలు

రెండు నెలల్లో 4కొత్త రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడోదర, ఆగస్టు 17: రైల్వే మంత్రి సురేశ్ ప్రభు బుధవారం నాలుగు కొత్త రకం రైళ్లను ప్రకటించారు. వీటిలో ఒకదానిని అన్‌రిజర్వుడ్ ప్రయాణికులకు, మిగతా మూడింటిని రిజర్వుడ్ ప్రయాణికుల కోసం ప్రకటించారు. మరో రెండు నెలల్లో ఇవి నడవడం ప్రారంభిస్తాయి. అత్యంత పేద ప్రజలు కూడా రైలు ప్రయాణం చేయడానికి వీలుగా అన్‌రిజర్వుడ్ రైలును ప్రవేశపెడుతున్నట్లు మంత్రి తెలిపారు. గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ సమక్షంలో వడోదరలోని నేషనల్ అకాడమి ఆఫ్ ద ఇండియన్ రైల్వే (ఎన్‌ఎఐఆర్), ఎంఎస్ యూనివర్శిటి ఆఫ్ బరోడా మధ్య బుధవారం ఇక్కడ ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైల్వే మంత్రి అనంతరం మాట్లాడుతూ అత్యంత పేద ప్రజలకు రైలు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజన్ అని అన్నారు. దూర ప్రాంతంలో నడిచే అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ పూర్తిగా అన్‌రిజర్వుడ్ బోగీలు ఉండే సూపర్ ఫాస్ట్ రైలు సర్వీసు అని సురేశ్ ప్రభు వివరించారు. రద్దీ మార్గంలో దీన్ని ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు.