జాతీయ వార్తలు

కుర్చీలు విరిచి..బారికేడ్లు ధ్వంసం చేసి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాల్దా (పశ్చిమ బెంగాల్), మార్చి 23: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీ స్థలంలో రచ్చ రచ్చ జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారులు కుర్చీలను విసిరికొట్టారు. వీఐపీ విభాగంలోని బారికేడ్లను ధ్వంసం చేశారు. అయితే, ఆ సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లేరు. వాస్తవానికి శనివారం రాహుల్ గాంధీ ఇక్కడ ఏర్పాటు చేసే ర్యాలీలో పాల్గొనేందుకు మధ్యాహ్నం మూడు గంటలకు బిహార్‌లోని పూర్ణియా నుంచి రావాల్సి ఉంది. అంతకుముందే వివిధ జిల్లాల నుంచి హాజరైన పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు మైదానంలో ఏర్పాటు చేసిన వలయంలోకి పెద్దఎత్తున దూసుకువచ్చి విధ్వంసం సృష్టించారు. సమావేశానికి హాజరైన తమకు కూర్చునేందుకు ఎలాంటి సౌకర్యాలు కల్పించనందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వంపై వారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కార్యకర్తల ఆందోళనను తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని సముదాయించేందుకు ప్రయత్నించారు. అయినా వారు ససేమిరా అంటూ వీఐపీ ప్రాంతంలో పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేల కోసం ఏర్పాటు చేసిన కుర్చీలను విసిరికొట్టి విధ్వంసం సృష్టించారు. అనంతరం పార్టీ నాయకులు జోక్యం చేసుకుని కార్యకర్తలను సర్దిచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.