జాతీయ వార్తలు

సంపన్నులను కాపాడే గార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్ణియా (బిహార్), మార్చి 23: ధనవంతుల సొమ్మును కాపాడే గార్డులాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యవహరిస్తున్నారని ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. మేమంతా కాపాలాదారులమే అంటూ బీజేపీ ప్రచార ఉద్యమం చేపట్టిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రధాని మోదీ చౌకీదార్ కానే కారని, డబ్బున్న వాళ్ల సంపదను కాపాడే గార్డు అని హేళన చేశారు. శనివారం ఇక్కడ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ఉత్తుత్తి హామీలతో రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను వమ్ము చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ సంపదన హరించే బీజేపీ నేతలు చౌకీదార్లు కారన్నారు. వీరు ఐశ్వర్యవంతుల కొమ్ముకాసే చౌకీదార్లు అన్నారు. వీరికి పేదల సంక్షేమం, రైతుల శ్రేయస్సు అక్కర్లేదన్నారు. ప్రధాని మోదీ తీరు వల్లనే పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీకి రాఫెల్ డీల్‌లో వాటా దక్కిందన్నారు. నీరవ్‌మోదీ, విజయ మాల్యాలు దేశం నుంచి మోదీ వల్లనే పరారయ్యారని ధ్వజమెత్తారు. ప్రతి పేదవాడి అకౌంట్‌లో రూ.15 లక్షలు జమ చేస్తామని చెప్పిన మాటలేమయ్యాయి. ఐదేళ్ల తర్వాత చూస్తే దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనీస ఆదాయం స్కీంను పేదలకు ప్రవేశపెడుతామన్నారు. రైతులకు రుణమాఫీ చేయకుండా మోసం చేస్తున్నారన్నారు. రైతాంగానికి సరైన గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా వేధిస్తున్నారన్నారు. దేశంలో రైతులకు ఐదేళ్లలో మోదీ చేసిందేమీ లేదన్నారు. గ్రామీణ ఆర్థిక రంగం సంక్షోభంలో ఉందన్నారు. ఉద్యోగాల కల్పనలో విఫలమయ్యారన్నారు. ద్రవ్యోల్బణం పెరిగిందన్నారు. ఆర్థిక వృద్థిరేటుపై తప్పుడు లెక్కలు ప్రచారం చేస్తున్నారన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలకు సంబంధించిన కనీస ఆదాయం గ్యారంటీ స్కీం కింద నగదును వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ఆర్థిక వ్యవస్థ ధ్వంసమైందన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల దేశానికి ఒక్క మేలు కూడా జరగలేదన్నారు. దీనిపై కేంద్రం చెప్పే కబుర్లను ప్రజలు విశ్వసించడంలేదన్నారు. బ్యాంకుల వద్ద కోట్లాది రూపాయలు రుణాలు తీసుకుని ఎగగొట్టిన వారికి కేంద్రం ఎర్రతివాచీ పరిచిందన్నారు. కాని రుణాలను మాఫీ చేశారన్నారు. అదే రైతులకు, మిగిలిన వర్గాలకు మొండి చేయి చూపించారన్నారు
చిత్రం.. పూర్ణియా ఎన్నికల ర్యాలీలో రాహుల్