జాతీయ వార్తలు

అద్వానీ ఎప్పటికీ అతి పెద్ద నాయకుడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 23: ఎల్‌కే అద్వానీ ఎన్నికల్లో పోటీ చేసినా చేయకపోయినా భారతీయ జనతా పార్టీలో అతి పెద్ద నాయకుడిగా ఉంటారని బీజేపీ మిత్రపక్షమయిన శివసేన పేర్కొంది. బీజేపీ సీనియర్ నాయకుడు అద్వానీ ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన తరువాత రెండు రోజులకు శివసేన ఈ వ్యాఖ్యలు చేసింది. అద్వానీ స్థానంలో అమిత్ షా పోటీ చేస్తుండటం అనేది భారత రాజకీయాలలో ‘్భష్మాచార్యుడి’గా ఎదిగిన అద్వానీని బలవంతంగా రాజకీయాల నుంచి విరమింపచేయడమేనని శివసేన తన అధికార పత్రిక ‘సామ్నా’ సంపాదకీయంలో పేర్కొంది. ‘్భరత రాజకీయాలలో భీష్మాచార్యుడిగా అందరికీ తెలిసిన లాల్‌కృష్ణ అద్వానీ పేరు బీజేపీ తరపున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారి జాబితాలో లేదు. ఇదేమంత ఆశ్చర్యం కలిగించలేదు’ అని సామ్నాలో ప్రచురితమయిన సంపాదకీయం పేర్కొంది. ‘బీజేపీలో అద్వానీ శకం ముగిసిందని ఈ పరిణామం నొక్కిచెబుతోంది’ అని శివసేన వ్యాఖ్యానించింది.
‘అద్వానీ గుజరాత్‌లోని గాంధీనగర్ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు గెలుపొందారు. ఇప్పుడు అమిత్ షాను ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తున్నారు. దీనర్థం అద్వానీని బలవంతంగా రాజకీయాల నుంచి పదవీ విరమణ చేయించడమే’ అని శివసేన సంపాదకీయం వ్యాఖ్యానించింది. 91 ఏళ్ల అద్వానీ కేంద్ర హోంమంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ 2014లో ఘన విజయం సాధించిన తరువాత అమిత్ షా బీజేపీ అధ్యక్షుడు అయ్యారు. అద్వానీకి ‘మార్గదర్శక్ మండల్’లో సభ్యుడిగా చోటు కల్పించారు. అద్వానీ బీజేపీ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. మాజీ ప్రధానమంత్రి వాజపేయితో కలిసి ఆయన బీజేపీ రథాన్ని నడిపించారు. ‘నేడు మోదీ, షాలు వారి (వాజపేయి, అద్వానీ) స్థానాలలోకి వచ్చారు. ఈసారి సీనియర్లకు ఎలాంటి బాధ్యతలు ఉండకుండా చూసే వాతావరణం ఇప్పటికే పార్టీలో ఏర్పడింది’ అని సామ్నా సంపాదకీయం పేర్కొంది.
ఇదిలా ఉండగా, గాంధీనగర్ సీటును అద్వానీ నుంచి దొంగిలించారని కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలను ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన ఖండించింది. పెద్దలను అవమానించడంపై కాంగ్రెస్ పార్టీ మాట్లాడకూడదని, క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను నడిపిన పీవీ నరసింహారావును మరణానంతరం కూడా ఆ పార్టీ అవమానించిందని శివసేన విమర్శించింది.