జాతీయ వార్తలు

రాహుల్ ఆదాయం ఎలా పెరిగిందో చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదాయం 2004తో పోల్చితే 2014లో పెరిగిందని బీజేపీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇంత ఆదాయం పెరిగేందుకు కారణాలేముంటాయని బీజేపీ ప్రశ్నించింది. కాగా కాంగ్రెస్‌పార్టీ ఈ అంశంపై ఇంకా స్పందించలేదు. కేంద్రమంత్రి రవి శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, 2004లో రాహుల్ గాంధీ ఆదాయం రూ.55 లక్షలు ఉంటే, 2014కు రూ.9 కోట్లకు పెరిగిందన్నారు. ఎన్నికల అఫిడవిట్ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్నట్లు ఆయన చెప్పారు. ఒక ఎంపీ ఆదాయం ఎలా పెరిగిందని ప్రశ్నించారు. 2009లో రాహుల్ గాంధీ తన ఆదాయం రూ.2 కోట్లని పేర్కొన్నారని చెప్పారు. ఒక ఎంపీకి ఆదాయం ఎలా వస్తుందనే విషయం అందరికీ తెలుసన్నారు. ఆదాయం పెంచుకోవడానికి రాహుల్ అనుసరించిన అభివృద్ధి అజెండాను తెలియచేయాలని కోరారు. 2జీ స్పెక్ట్రమ్‌స్కాంతో సంబంధం ఉన్న యూనిటెక్‌కు చెందిన రెండు ఆస్తులను ఏమైనా కొన్నారా అని ఆయన ప్రశ్నించారు.